ఓటర్లకు సహాయంగా పోలీస్ సిబ్బంది

ఓటర్లకు సహాయంగా పోలీస్ సిబ్బంది

ఓటర్లకు సహాయంగా పోలీస్ సిబ్బంది..

చురకలు ప్రతినిధి, జగిత్యాల, డిసెంబర్ 14 :  రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గం సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఓటు వేసేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులకు పోలీసు సిబ్బంది తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. పెంబట్ల గ్రామంలోని  ఓ పోలింగ్ బూత్ లో విధులు నిర్వహిస్తున్న రవి నాయక్ అనే కానిస్టేబుల్ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఓటు వేయడానికి రాగా ఆయనను వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకెళ్లి ఓటు వేయించారు. పోలీస్ సిబ్బంది అందిస్తున్న సహాయ సహకారాల పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.IMG-20251214-WA0011

Tags: