బోధన్ కేసులో సస్పెండ్ ఆయినా ఉద్యోగులను తిరిగి విధుల్లో తీస్కోండి ముజేహిద్ హుస్సేన్

బోధన్ కేసులో సస్పెండ్ ఆయినా ఉద్యోగులను తిరిగి విధుల్లో తీస్కోండి ముజేహిద్ హుస్సేన్

బోధన్  కేసులో సస్పెండ్ అయిన  ఉద్యోగులను తిరిగి విధులలో తీసుకోండి

 టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ 

 చురకలు విలేఖరి
కరీంనగర్, జనవరి, 20

 రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో ప్రభుత్వ ఖజానాకు చెల్లించవలసిన బకాయిలను ఒక ఆడిటర్ మరియు కొంతమంది రైస్మిల్ యజమానులు కలిసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినారు ఆ సందర్భంలో విచారణ చేయగా బోధన్ చాలన్ కేసు లో వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన అధికారులను ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగింది వాస్తానికి ఒక ఆడిటర్ లాలూచీపడి మరియు కొంతమంది రైస్ మీల్ యజమానులు కలిసి కుక్కుర్తి బడి ప్రభుత్వ ఖజానాకు కట్టవలసిన బకాయిలను కట్టకుండా ఒక ఆడిటర్ అన్ని రకాలుగా పొరపాటు చేసి అధికారులపై మరియు ఉద్యోగులపై ఆడిటర్ చేసిన తప్పులను ఉద్యోగుల మీద నెట్టేసి అతను తప్పించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినారు అలాంటి సమయంలో అప్పటి అధికారులు బోధన్ చాలన్ కేసులో అన్ని కోణాలలో విచారణ చేయగా దానిలో ఆడిటర్ మరియు రైస్ యజమానులు చేసిన తప్పుడు విధానాలలో ఉద్యోగుల కూడా హస్తముందని చెప్పి బోధన్ వాణిజ్య పన్నుల శాఖలు అప్పుడు పని చేసిన చాలామంది ఉద్యోగులను అధికారులను సస్పెండ్ చేసి విచారణ చేసి అన్యాయంగా అధికారులు ఉద్యోగులు జైలు జీవితం కూడా అనుభవించినారు దాన్ని తర్వాత వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన పై స్థాయి అధికారులందరూ కలిసి బకాయిలు పడ్డ రైస్ మిల్ల వద్ద తిరిగి మళ్లీ ప్రభుత్వ ఖజానాకు రావలసిన రెవెన్యూ కూడా కట్టించారు అప్పటినుండి ఇప్పటివరకు వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన ఉద్యోగులను సస్పెండ్ చేసిన వారిని ఇప్పటివరకు కొంతమందిని తిరిగి తీసుకున్నారు మిగిలిన ఉద్యోగులను కూడా తిరిగి విధులలో తీసుకోవాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వాణిజ్య పనుల మరియు ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణిజ్య పన్నుల  శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. 
కొన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యోగులు సస్పెండ్ అయినప్పటి నుండి వారి కుటుంబాలలో అనేక రకాల ఇబ్బందులు పడుతూ వారి తల్లితండ్రులను వారి పిల్లలను వారి కుటుంబాలలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ మానసికంగా కుమిలిపోతున్నారు కావున వారి వారందరినీ తిరిగి మళ్లీ తిరిగి ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు 
వాణిజ్య పన్నుల శాఖలో సస్పెండ్ అయినప్పటి నుండి ఇప్పటివరకు వారికి సరి అయిన జీతం రాక వారి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులలో ఉన్న భార్యను పిల్లలను పోషించడానికి నాన్న రకాల అవస్థలు పడుతున్నారు కావున మానవత్వం తో ఆలోచించి వారికి కూడా తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు 
కొంతమంది ఉద్యోగులు తినడానికి తిండి లేక తల్లితండ్రులను హాస్పటల్లో ట్రీట్మెంట్ చేసే పరిస్థితులలో లేరు వారి పిల్లలకు ఫీజులు కట్టె పరిస్థితిలో కూడా వారు లేరు కనుక కిరాయి ఇళ్లలో ఉంటూ జీవనం గడుపుతున్నారు బయట ప్రవేట్ వ్యక్తుల వద్ద వెళ్లి ఏదో ఒక పని చేసి తమ కుటుంబానికి నెట్టుకొని వస్తున్నారు కావున ఏ పరిస్థితులలో వారు తప్పులు చేశారా లేదా అని కాకుండా మానవత్వంతో ఆలోచించి వారిని వాణిజ్య పన్నుల శాఖలో తిరిగి ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ వాణిజ్య మరియు ఎక్సైజ్ శాఖ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావుకు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు 
ఇదే వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన అధికారులు పదవి విరమణ పొందినారు మరియు కొంతమంది మానసికంగా కుమిలిపోతున్నారు చిన్న స్థాయి ఉద్యోగులు వారి కుటుంబాలను నెట్టుకుంటూ వస్తున్నారు కావున ఒక్కసారి వారి గురించి వారి కుటుంబాల గురించి వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారిని మిగిలిన వారిని అందరిని వాణిజ్య పన్నుల శాఖలో తిరిగి విధులలో తీసుకోవాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావు మహమ్మద్ ముజాహిద్ విజ్ఞప్తి చేశారు 
వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఎంతోమంది ఉద్యోగులు వారి అందరికీ అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఎన్నో సంవత్సరాలనుండి ప్రమోషన్ల కొరకు ఎదురుచూస్తున్న వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి ఇతర ఏదైనా సమస్యలు ఉండి కూడా కమిషనర్ ఎం రఘునందన్ రావు కలిసి చెప్పుకున్నా ఉద్యోగి సమస్య కూడా పరిష్కరించటంలో మొదటి స్థానంలో సాయం చేసే వ్యక్తి మన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు 
తిరిగి వాణిజ్య శాఖలో మాకు ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తున్నారు మానసికంగా కుమ్ములిపోయి ఉన్న ఉద్యోగులను ఒక్కసారి వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వారికి వెంటనే వాణిజ్య పన్నుల శాఖలో తిరిగి ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మరియు ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావుకు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.IMG-20250314-WA0091

Tags:

Related Posts