ఆ ప్రమాదం తో ఎల్పిజీ కి సంబంధం లేదు

ఆ ప్రమాదంతో ఎల్పీజీకి సంబంధం లేదు
- ఇండియా ఆయిల్ చీఫ్ జనరల్ మేనేజర్ వెట్రిసెల్వకుమార్

     చిత్తూరు, డిసెంబర్ 1, 2025: తిరుపతి జిల్లా వేలంపాడు గ్రామంలో ఇటీవల జరిగిన ప్రమాదంతో ఎల్పీజీకి ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ వీ వెట్రిసెల్వకుమార్ తెలిపారు. ఆ ప్రమాదం ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్ పేలుడు వల్ల జరగలేదన్నారు. అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఆ ప్రమాదం ఒక పరిశ్రమ ప్రాంగణంలో ఒక ప్రైవేట్ ఆపరేటర్ నైట్రోజన్‌తో వెసల్/ట్యాంక్‌కు ప్రెజర్ టెస్టింగ్ నిర్వహిస్తుండగా జరిగిందన్నారు. అందువల్ల ఆ ఘటనతో ఎల్పీజీకి ఎటువంటి సంబంధం లేదన్నారు.

Tags: