వృద్ధులను వేదిస్తే చట్టపర చర్యలు ఎస్పీ అశోక్ కుమార్
వృద్ధులను వేధిస్తే చట్టపర చర్యలు. ఎస్పీ ఆశోక్ కుమార్. జగిత్యాల మే 5:వయోవృద్ధులను వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆశోక్ కుమార్ అన్నారు.సోమవారం జగిత్యాల జిల్లా సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్ ను కలిసి ప్రతి సోమవారం కార్యాలయంలో ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరిస్తున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు.అనంతరం తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన వృద్ధుల సంరక్షణ చట్టం 2007,రూల్స్ 2011 లోని అంశాల గోడ స్టిక్కర్లను ఎస్పీ ఆశోక్ కుమార్ ఆవిష్కరించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సీనియర్ సిటీజేన్స్ ను సంరక్షణ చేయకుండా వేధింపులకు గురిచేసే వారిపై పోలీసు శాఖ పరంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. సీనియర్ సిటీజేన్స్ రక్షణకు మరింత ప్రాధాన్యత నిస్తామన్నారు.జిల్లాలో వయో వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న,ప్రజల అవగాహన కు వృద్ధుల సంరక్షణ చట్టం 2007 నియమావళి 2011 అంశాల గోడ స్టిక్కర్లను అన్ని గ్రామ పంచాయితీల్లో,ప్రభుత్వ కార్యాలయాల్లో,పబ్లిక్ స్థలాల్లో అంటించి అవగాహనకు తోడ్పాటు అందిస్తున్న సీనియర్ సిటీజేన్స్ జిల్లా ,డివిజన్ ,మండల ప్రతినిధులను అభినందించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత రెడ్డి,ఎం.డి.యాకూబ్, కోశాధికారి వి.ప్రకాష్ రావు,ప్రతినిధులు దిండిగాల విఠల్,వెల్ముల ప్రభాకర్ రావు,గంగం జలజ,తదితరులు పాల్గొన్నారు.