విదేశాలకు పంపిస్తానని మోసం చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు.
విదేశాలకు పంపిస్తానని మోసం చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మే 3: విదేశాలకు పంపిస్తానని మోసం చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు జగిత్యాల పట్టణ ఇన్స్ పెక్టర్ ఎస్.వేణుగోపాల్ తెలిపారు.
శనివారం జగిత్యాల పట్టణ కేంద్రంలో గల జమ్మిగద్దె ప్రాంతంలో గల లక్ష్మి ట్రావెల్స్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తి ఎలాంటి ప్రభుత్వం అనుమతి, లైసెన్స్ లేకుండా అమాయక ప్రజలను విదేశాలకు పంపిస్తానని నమ్మబలికి వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్నారని వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు జగిత్యాల ఇన్స్పెక్టర్ ఎస్.వేణుగోపాల్ ఆదేశాల మేరకు ఎస్ఐ గీత వారి సిబ్బందితో వెళ్లి అట్టి ట్రావెల్స్ లో తనిఖీ చేశారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడని, ఒక ఆఫీస్ అద్దెకు తీసుకొని రిసెప్షన్ ఏర్పాటు చేసుకొని ఒక వ్యక్తి ద్వారా అమాయక ప్రజలకు ఫోన్ చేస్తూ అధిక జీతంతో ఉద్యోగాలు ఉన్నాయని విదేశాలకు పంపిస్తానని నమ్మబలుకుతూ వారిని మోసం చేస్తున్నాడని విచారణలో తెలిసిందన్నారు. నిందితుడు దండుగుల నవీన్ సారంగాపూర్ మండలం రంగపేట్ గ్రామానికి చెందిన వ్యక్తి కాగా ప్రస్తుతం జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణవాడలో ఉంటుంన్నాడని, సుమోటోగా కేసును స్వీకరించి అతనిపైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.