13 మంది పేకాటరాయుల అరెస్ట్
13 మంది పేకాట రాయుల అరెస్ట్
చురకలు విలేఖరి
కరీంనగర్, మే 21
శుభం ప్రకాష్ ఏఎస్పీ కరీంనగర్ రూరల్ ఆదేశాల తో కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి, కొత్తపెళ్లి ఏఎస్ఐ ఏం పోచయ్య, సిబ్బంది యుక్తంగా రేకుర్తిలోని ఒక ఇంటిలో గేమింగ్ ఆడుతున్నారని సమాచారం మేరకు ఇంటిని తనిఖీ చేయగా అందులో 13 మంది వ్యక్తులు డబ్బులను బెట్టింగా పెట్టి మూడు పత్తాలు ఆడుతుండగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 365,760/- రూపాయలను మరియు 14 సెల్ ఫోన్ లను స్వాధీనపరచుకొని వారిపై కేసు నమోదు చేశారు. ముత్యాల తిరుపతి, సల్లూరి నర్సయ్య, గోనె సాగర్ రావు, తాళ్లపల్లి తిరుపతి, కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, రెక్కుల శ్రీనివాస్, నందలి అన్వేష్, వాళ్ల కిషోర్ కుమార్,వావిలాల వేణుగోపాల ప్రసాద్,కొండపాక శ్రీధర్, కొండ దేవయ్య, ముసక ఉపేందర్, బొట్టు రవీందర్ వీరికి నోటీసులు సర్వ్ చేసి తదుపరి చర్య గురించి కోర్టులో చార్జి షిట్ దాఖలు చేయనున్నట్లు కరీంనగర్ రూరల్ సిఐ ఏ, నిరంజన్ రెడ్డి తెలిపారు.