బాధ్యతగల పౌరునిగా భూ ఆక్రమణను వెలుగులోకి తీసుకోని వచ్చిన, మాజీ మంత్రి జీవన్ రెడ్డి
బాధ్యతగల పౌరుడిగా భూ ఆక్రమణాను వెలుగులోకి తీసుకువచ్చిన.
100 కోట్ల ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత..
యాజమాన్య హక్కులను కోర్టు ధృవీకరించలేదు...
కిబాల పత్రం 1975 వరకు ఎందుకు సమర్పించలేదు...
2008 నుండి యాజమాన్య హక్కుల కోసం సివిల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు..
ప్రభుత్వ ఆస్తులు సంరక్షించడం పౌరుడిగా నా బాధ్యత..
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులు సంరక్షిస్తుంది...
రూ.100 కోట్ల విలువైన ఆస్తిని మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలి...
మాజీ మంత్రి తాటి పర్తి జీవన్ రెడ్డి..
జగిత్యాల, అక్టోబర్, 29
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో కాంగ్రెసు నాయకులతో కలిసి మాజీ మంత్రివర్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పెట్రోల్, డీసెల్, కిరోసిన్ పంపు ఏర్పాటు కోసం సర్వే నంబర్ 138 లో 20 గుంటల స్థల వివాదం పై మున్సిపల్ వేసిన బాలే వీరేశం సబ్ కమిటీ కి కూడా కి బాల సమర్పించలేదు.
యాజమాన్య హక్కులను న్యాయస్థానం లో ధృవీకరించుకోలేదు.
దారం వీర మల్లయ్య వారసులు యాజమాన్య హక్కుల కోసం కోర్టులో ఏనాడు దావా వేయలేదు..
మున్సిపాలిటీ చేసిన తీర్మానం 140 రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందనీ, కోర్టు పేర్కొంది.
తను వేసిన రిట్ లకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, మున్సిపల్ తీర్మానం రద్దు చేశారనడం అక్షరాల తప్పు..
2004 లో జీ ఆర్ దేశాయ్ చైర్మన్ గా ఉన్నప్పుడు
పెట్రోల్, డీసెల్, కిరోసిన్ పంపు ఏర్పాటు కోసం ఇచ్చిన స్థలము మినహా మిగిలిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ కౌన్సెల్ తీర్మానం చేశారు.
1952 లో డాక్యుమెంట్ భూ కేటాయింపు అమలు చేసినట్లు చెబుతుండగా1958 పత్రం గా గుర్తించారు. అప్పుడు కూడా జిరాక్స్ మాత్రమే సమర్పించారు.
పెట్రోల్, డీజిల్, కిరోసిన్ బంక్ ఏర్పాటు కోసం మాత్రమే భూ కేటాయింపు చేశారు.
యాజమాన్య హక్కులు సివిల్ కోర్టులో తేల్చుకోవాలని కోర్టు సూచించింది.
బాధ్యత గల పౌరుడిగా, ప్రభుత్వ స్థలం రూ.100 కోట్ల విలువ చేసే ఆస్తిని స్వాధీనం చేసుకొనుటకు చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరాను. మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోనీ, ప్రజా అవసరాలకు ఉనయోగించాలి.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం, ఆక్రమణలను తొలగించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో హైడ్రా ఏర్పాటు చేశారు.
యాజమాన్య హక్కుల నిర్ధారణ చేసేది హై కోర్టు కాదని, సివిల్ కోర్టు కు వెళ్లని కోర్టు సూచించింది.
హైడ్రా పరిధిని జిల్లాలకు విస్తరించాలని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి అవుతున్నాయని గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన.
చెరువులు,కుంటల అక్రమాలతో మత్సకారుల ఉపాధి కరువవుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను.
కోర్టు మున్సిపల్ చర్యలు చేపట్టేంత వరకు కొనసాగవచ్చని మాత్రమే పేర్కొంది.
ఏ న్యాయస్థానం కూడా భూ ఆక్రమణదారులు యాజమాన్య హక్కులను నిర్ధారించలేదు.
రోడ్డు వెడల్పు చేయాలంటే నియమ నిబంధనలు పాటించాలని కోర్టు చెబుతోంది..
మున్సిపల్ చట్టపరమైన చర్యలు చేపట్టే వరకు యధావిధిగా ఉండాలని పేర్కొంది, కానీ కోర్టు మున్సిపల్ అధికారాలను నియంత్రించలేదు.
పెట్రోల్, డీసెల్, కిరోసిన్ పంపు కోసం మినహా
ఇతర వినియోగించడం చట్ట విరుద్ధం.
పిటిషనర్ రిట్ లో రెవెన్యూ రికార్డులలో పహాని లో దారం వీర మల్లయ్య కబ్జా లో ఉన్నారు.. కానీ పట్టాదారు కాలమ్ లో పేరు నమోదు చేయలేదు అని పేర్కొన్నారని కోర్టు స్పష్టం చేసింది.
యాజమాన్య హక్కులు లేవని భావించినప్పుడు కబ్జలో కొనసాగడం ఆ నైతికం కాదా అని ప్రశ్నించారు.
కిబాలా ద్వారా హక్కులు పొందామని చెబుతున్న వారు 1975 పైకి కిబాల తెర పైకి రాకపోవటం..అనుమానాలకు తావిస్తోంది.
కి బాల ద్వారా భూమి పొందామని చెబుతున్న వారు సభ్య సమాజానికి, వాస్తవాలు చెప్పాలి..
భూ వివాదం ఈనాటిది కాదు..1964 నుండి భూ వివాదం కొనసాగుతోంది.
బాధ్యత గల పౌరుడిగా, ప్రజల అనుమానాలు తొలగించాల్సిన బాధ్యత మంచాల కృష్ణ పై ఉంది..
యాజమాన్య హక్కులు మున్సిపాలిటీ కి ఉన్నాయి కాబట్టి చట్టపరంగా చర్యలు చేపట్టాలని కోరుతున్న.
దారం వీరమల్లయ్య జీవిత కాలం లో కి బాల
ఎందుకు సమర్పించలేకపోయారు. దీంతో కి బాల సృష్టించబడ్డ ది అని అనుమానాలకు బలం చేకూరింది.
కి బాల పెట్రోల్, డీజిల్ కిరోసిన్ కాకుండా ఇతర వినియోగాలకు ఉపయోగించడం
చట్ట విరుద్ధం.
కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతమైన ప్రభుత్వం.. అన్యాక్రాంతమైన ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవటానికి వెనకాడదు.
ఇంతకాలం ఈ భూ ఆక్రమణ నా దృష్టికి తీసుకురాలేదు.
ఇటీవల కాలం నా దృష్టికి రావడం తో
ప్రమాదకరంగా ఉన్న జనరేటర్ తొలగించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాను..
ప్రజా ప్రతినిధిగా ఆక్రమణదారులు ఎంతటి వారయినా ప్రభుత్వం వెనకడుగు వేయదు..
ప్రభుత్వ ఆస్తులు కాపాడడం లో నేను ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.
ముఖ్యముగా దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడిన.
ధరూర్ లో ప్రభుత్వ ఆస్తులు కాపాడిన తృప్తి ఉంది ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు.
నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో ప్రభుత్వ ఆస్తులు కాపాడిన అనే సంతృప్తి మిగిలింది.
నేను ప్రజా పక్షం..ప్రజల సమస్యలు ప్రజల దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత గా భావిస్తున్న.
యాజమాన్య హక్కులు లేకుండా..నిబంధనలు ఉల్లంఘించిన ఆక్రమణదారులను తొలగించాలనీ ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్న.

