నిరుపేద బాలుడి వైద్యం కోసం 1.61 లక్షలు విరాళాలు

నిరుపేద బాలుడి వైద్యం కోసం 1.61 లక్షలు విరాళాలు

నిరుపేద బాలుడి వైద్యం కోసం
 1.61 లక్షలు విరాళాలు.
.......................................
రామ కిష్టయ్య సంగన భట్ల 
..........................................


గత కొన్ని నెలల నుండి బోన్ మ్యారో వ్యాధితో ఇబ్బందులు పడుతున్న నిరుపేద బాలుడు రుద్రాంన్ష్ కు వైద్య ఖర్చుల కోసం ఫేస్ బుక్ మిత్రులు రూ.1.61 లక్షలు విరాళాలు అందించారు.
గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామానికి చెందిన అల్లాడి ప్రభాకర్, అనురాధ దంపతుల కుమారుడు  రుద్రాంన్ష్ (3) అనే బాలుడు కొన్ని నెలల క్రితం నుండి బోన్ మ్యారో  వ్యాధితో బాధపడు తున్నాడు. వైద్యానికి లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉండగా తల్లిదండ్రులు నిరుపేదలు అవడంతో వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న  ధర్మపురి కి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట  రమేష్  స్పందించి ఈ నెల 4 న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సాయం అందించాలని కోరాడు. ఫేస్బుక్ పోస్టుకు స్పందించిన ఎన్నారైలు,ఇతర దాతలు అనురాధ బ్యాంకు ఖాతాకు 1.61 లక్షలు పంపించారు. వాటిలో కొంత మొత్తాన్ని గురువారం జగిత్యాల సిఐ కరుణాకర్,ఎస్సై రవికిరణ్ తో పంపిణీ చేయించాడు. మిగతాది ఆమె బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంచారు. ప్రభుత్వం సైతం స్పందించి బాలుడు వైద్యానికి సహాయం అందించాలని రమేష్ కోరాడు.IMG-20251030-WA0079

Tags: