దేవ్జీకి షాక్ ఇచ్చిన హిడ్మా మృతి..!

దేవ్జీకి షాక్ ఇచ్చిన హిడ్మా  మృతి..!

దేవ్జీకి షాక్ ఇచ్చిన హిడ్మా మృతి.!

-ఇండియాలో వణుకు పుట్టించిన సింగిల్ నేమ్ .
-మావోయిస్ట్ పార్టీలో ఎస్సీ ఎస్టీ సారథ్యానికి దెబ్బ 

చురకలు ప్రత్యేక ప్రతినిధి

-మల్లోజుల పోతే పోని,వాసుదేవరావు వెళ్లి పోతే నష్టంలేదు..ప్రసాదరావు లొంగిపోతాడని ప్రచారం పాతదే..ఇంకా కొంత మంది నాయకులు కూడా పోతారు.ఐనా సరే రష్యాలో చర్మకారుడు స్టాలిన్ తో విప్లవం వచ్చింది..అణగారిన వర్గాల నుంచి వచ్చిన నాయకత్వం తో పార్టీ మళ్లీ బతుకుతుందని ఆశించిన వారికి హిడ్మా ఎన్కౌంటర్ షాక్ లో పడేసింది.
ఆంధ్రా ఒడిషా బార్డర్ జరిగిన ఎదురు కాల్పుల్లో మావో నేత హిడ్మా పోలీస్ బలగాలకు తెల్లకోడిలా చిక్కి,పిట్టల రాలినట్టుగా..ఆరుగురి తో సహా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.హిడ్మా ఆపార్టీ సైన్యాధికారి గా,ఆ పార్టీ నాయకుడు పిరంగిగా పనిచేస్తున్నారు.ఆలాంటి హిడ్మా గురించి రెండేళ్లుగా ఓ లక్ష సార్లు మరణించినట్లు..ఓ లక్ష సార్లు తప్పించుకున్నటు వార్తలు వచ్చాయి..అవన్నీ అబద్ధాలు…అబద్ధాలు రాసినవారు తాము ఎప్పుడో చెప్పినట్లు ఇప్పుడు చెప్పుకోవచ్చు ..ఎట్టకేలకు అన్నట్టుగా ఎన్కౌంటర్లో మరణించిన వారిని గుర్తించారు పోలీసులు. వీరిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పార్టీ నేత, కేంద్ర కమిటీ సభ్యుడు, పీఎల్జీఏ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మడావి హిడ్మా అలియాస్ సంతోష్, అతని భార్య, డివిజనల్ కమిటీ సభ్యురాలు రాజీ, జిల్లా కమిటీ సభ్యుడు లక్మల్, పీపీసీఎంలు కమ్లూ, మల్ల, హిడ్మా గార్డ్ దేవ్ చనిపోయినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో తిరుగులేని పట్టు ఉన్న హిడ్మా సేఫ్టీ కోసం ఏఓబీ ప్రాంతంలో అడుగు పెట్టారు కావొచ్చు.బలగాలకు తారస పడడం ఎన్కౌంటర్లో హతం కావడం సంచలనంగా మారింది. హిడ్మా కోసం పోలీసులు టార్గెట్ గా చేసుకొని ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.ముఖ్యంగా ఆపరేషన్ కగార్ కు మోస్ట్ వాంటెడ్ ఆలాంటి ఆయన ఏపీలోని అల్లూరి సీీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షెల్టర్ తీసుకునేందుకు వచ్చి  ఈజీగా ఉంటాడని భావిస్తున్నారు. హిడ్మా హతం తో ఛతీస్ఘడ్ మావో ఈస్ట్ గుండె చెదిరిందని చెప్పాలి.ఇటీవల కాలంలో చత్తీస్ గడ్ బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఆయనతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నాయకులంతా ఏఓబీ అటవీ ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్న సమాచారం మేరకు జాయింట్ ఆపరేషన్ కొనసాగించినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుండి 2 ఏకె 47, ఒక రివాల్వర్, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం.

మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకత్వం అంతా కూడా జనజీవనంలో కలిసేందుకు బయటకు వస్తున్న నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ హిడ్మా కూడా బయటకు రావాలని చత్తీస్ గడ్ ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలోనే హిడ్మా స్వగ్రామమైన సుక్మా జిల్లా పవ్వర్తికి అక్కడి డిప్యూటీ సీఏం విజయ్ శర్మ వెళ్లారు. హిడ్మాతో పాటు దేవా కుటుంబ సభ్యులను కలిసి బాహ్మ ప్రంపంచంలోకి వచ్చేందుకు పిలుపునివ్వాలని సూచించారు. వారితో పాటు సహపంక్తి భోజనం కూడా చేశారు. హిడ్మా పార్టీని వీడినట్టయితే దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి లేకుండా పోతుందని భావించి అక్కడి ప్రభుత్వం హిడ్మా లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అనూహ్యంగా మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు పార్టీ నాయకుల్లో హిడ్మాతో పాటు అతని భార్య కూడా ఉండడం సంచలనంగా మారింది. పోలీసు వర్గాలు కూడా హిడ్మా ఉన్నట్టుగా ధృవీకరించడంతో మావోయిస్టు పార్టీ తీరని నష్టాన్ని చూసిందనే చెప్పాలి.పెద్ద ఎత్తున కార్యకర్తలు సహా అగ్రనేతలు కూడా లొంగి పోతున్నారు ఈ సమయంలో హిడ్మా,దేవ్జీ,దామోదర్,దేవల్,మాంజా లాంటి దళిత,ఆదివాసీ గిరిజనులే ఇక మావోయిస్టు పార్టీ బలోపేతం చేస్తారన్న విశ్వాసం పై ప్రచారం చేస్తున్నారు.ఇలా ఊహించ లేదు హిడ్మాను అనే యుద్ధ వీరుడు నేల కొరిగి పోయిన తర్వాత పెద్ద షాక్ దేవ్జి కి తగిలిందని విశ్లేషకులు అంటున్నారు 


అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఏపీ డీజీపీ హరిష్ కుమార్ గుప్తా కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మారేడుమిల్లి నుండి మావోయిస్టుల ఏరివేతపై సమీక్షిస్తున్నట్టుగా సమాచారం.బీజేపీ కేంద్ర సర్కార్ తలపెట్టిన కగార్ దెబ్బలకు కేంద్ర కమిటీ సెక్రటరీ జనరల్ నంబాల్లా కేశవరావు సహా నేటి హిడ్మా వరకు ముఖ్యులు వరుసగా కాల్చివేతకు గురయ్యారు.ఇక మిగిలిన వాల్లను మట్టుబెట్టడం పోలీసులకు పెద్ద సమస్యగా కానే కాదు..ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే 500 లోపు నక్సలైటు ఉండగా వాళ్లను చంపడానికి లక్షమంది పోలీసులు,సైనికులు ఉన్నారు.IMG-20251118-WA0141

Tags: