పదవి విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం ఎస్పీ అశోక్ కుమార్

పదవి విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం ఎస్పీ అశోక్ కుమార్

 

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  IMG-20251030-WA0062

*- - - పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష*

చురకలు విలేఖరి

జగిత్యాల, అక్టోబర్, 30


 విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న ఎస్.ఐ వెంకట్ రావు, ఏ.ఎస్.ఐ లు బాలాజీ,గజేంధర్,హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్, లను ని శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసిన  ఎస్పీ  

ఈరోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా పాల్గొన ఎస్పీ  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..  ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు.  ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు. విజయవంతంగా సర్వీస్ పూర్తి చేసిన అధికారుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు. పదవి విరమణ అనంతరం  కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు.

అనంతరం పదవి విరమణ పొందిన అధికారులను పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ బ్యాండ్ తో ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటరమణ , రిజర్వ్ ఇన్స్పెక్టర్ వేణు , మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags: