పోలీస్ అమర వీరుల దినోత్సవం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, అక్టోబర్ 21 : పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరుపుకుంటారు. భారత్-చైనా
సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల
అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటి బుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది.
దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా
పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత
భూభాలైన లడక్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి.
సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్
వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్ర
రిజర్వు పోలీస్ ఫోర్స్ బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ
బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు
ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్
ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో
పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు.
హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్రస్థలంగా రూపు దిద్దుకుంది. ప్రతి ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ. నిద్రాహారాలు మాని డ్యూటీలు చేసే పోలీసులంటే
అటు అధికారులకు, ఇటు సమాజానికి చిన్నచూపే.
సమయపాలన లేని విధులు, పై అధికారులతో తిట్లు,
జనంతో ఛీత్కారాలు... ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అన్ని
సమస్యలతో విధులు నిర్వర్తిస్తున్నా ఎవరూ గుర్తించడం లేదని చాలామంది పోలీసులు వాపోతున్నారు. పోలీసులకు విశ్రాంతి కావాలనే
విషయాన్ని పాలకులు, అధికారులు విస్మరిస్తున్నారు. పోలీసులకు షిప్టు డ్యూటీలు
అమలు చేయలంటూ ఉమ్మడి ప్రభుత్వం 2007లో జీవో జారీ చేసింది. తొమ్మిదేళ్ళు గడిచినా ఆ ఊసే లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే పోలీసుల విధులు విభిన్నం. వీరికి పని గంటలతో సంబంధం
ఉండదు. నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రతిక్షణం ఆలోచించాల్సిందే. దీంతో వారు తీవ్రమైన
మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి
కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు అందరినీ
పరిగణనలోకి తీసుకొంటే 80 శాతం మంది తలనొప్పి, బీపీ, మధుమేహం, మెడ, వెన్నునొప్పి ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు
అధికారిక లెక్కలే చెబుతున్నాయి. హోంగార్డు,
కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్ల పరిస్థితి మరీ దారుణం. డ్యూటీకి వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్లేంత వరకు విరామం లేకుండా
పనిచేయాల్సిందే. బందోబస్తు డ్యూటీల్లో పాల్గొనేవారి పరిస్థితి సరేసరి. సిబ్బంది కొరత కారణంగా సెలవులు
మంజూరుకాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రోజూ
40 మంది సిబ్బంది అనారోగ్యంతోనే విధులకు
హాజరవుతున్నట్లు సమాచారం. ట్రాఫిక్ డ్యూటీలు
నిర్వహించే సిబ్బంది కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల
సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ట్రాఫిక్ సిబ్బంది అనారోగ్యకర వాతావరణంలో
విధులు నిర్వహిస్తున్నందున ప్రభుత్వం వారికి
అదనపు వేతనం చెల్లిస్తున్నా సరైన ఆరోగ్య పరీక్షలు లేనికారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్ని సమస్యల మధ్య సమాజానికి ఇంత సేవ చేస్తున్న పోలీసులను గౌరవించడం మనందరి బాధ్యత.
జగిత్యాల జిల్లాలో పోలీసు అమర వీరులు.......
ఆనాటి కరీంనగర్ జిల్లాలోని ప్రస్తుత జగిత్యాల జిల్లాలో గల ధర్మపురి సర్కిల్ కేంద్రంలో ధర్మపురి బస్టాండ్ సమీపంలో పీపుల్స్ వార్ నక్సల్స్ ధర్మపురి లో పని చేస్తున్న రామడుగు మండలం వేదేరే గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ సి.హెచ్. కోమల్ రెడ్డి, పీసీ 1072 ను జూలై 23,1985 నాడు జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ల పై కాల్పులు జరిపి హత మార్చారు. ఆ తర్వాత కథలాపూర్ మండలం భూషణ్ రావు పేట లో ఫిబ్రవరి 23,1991నాడు ముహమ్మద్ మొయిన్ ఒద్దీన్ పీసీ నెంబర్ 852,మరియు హెడ్ కానిస్టేబుల్ హెచ్.సి 485, ఫాజలోద్దీన్ లను పీపుల్స్ వార్ నక్సల్స్ కాల్చి చంపడం జరిగింది. జగిత్యాల మండలం హబ్సిపూర్ గ్రామం లో సెప్టెంబర్ 10,1991నాడు సయ్యద్ మోబిన్ హెడ్ కానీస్టేబుల్ హెచ్.సి 520 ను కాల్చి చంపడం జరిగింది. మెట్ పల్లి లో ఏప్రిల్ 28,1993 నాడు, హెడ్ కానిస్టేబుల్ హెచ్.సి 1113, యం.ఏ, లతిఫ్ ను కాల్చి చంపడం జరిగింది. సారంగాపూర్ మండలం బట్టపల్లి, పోతారం, నేరెళ్ల గ్రామాల మధ్య పీపుల్స్ వార్ నక్సల్స్అమరచిన బ్లాస్టింగ్ లో అక్టోబర్ 12,1993 నాడు సారంగాపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన హెచ్.సి నెంబర్ 1515, శ్రీనివాస్, పీసీ నెంబర్ 1713, రాజయ్య, పీసీ, శ్రీనివాస్, పీసీ, నెంబర్ 812,ప్రకాష్ లు హతం అవ్వడం జరిగింది.
అమరులు..... వీరే....
1998 మే 28న బెల్లంపల్లి పాతబస్తీ దగ్గర సికాస (సింగరేణి కార్మిక సమాఖ్య) పోలీసులకు మద్య జరిగిన కాల్పుల్లో హెడ్ కానిస్టేబుళ్లు సంజీవ్ కుమార్, శేషులు మరణించారు.
1999 డిసెంబర్ 2న ఖానాపూర్ మండలం తార్లపాడు వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఖానాపూర్
స్సె సింగం మల్లేష్, కానిస్టేబుళ్ పున్నంచండ్లు మరణించారు.
పి.చక్రపాణి (సీఐ), ఎస్సెలు సీహెచ్ లక్ష్మణ్ రావు , టి.
రాజన్న , బి . కోటి నాయక్, అహ్మద్ షరీఫ్, ఎస్. మల్లేష్,
సయ్యద్ ఖాదీర్ ఉల్ హక్ , సీహెచ్ మధన్ మోహన్
(ఎఎస్సై), హెడ్ కానిస్టేబుల్ ళ్లు ఎం లక్ష్మణ్ , ఎంఎ గఫర్,
ఎండీ జాహురుద్దిన్, ఎంఎ జలీల్, ఎకె హైదేర్,
తాహేర్ మహ్మద్, ఎ. గోవర్ధన్, సయ్యద్ హమీద్ ఉద్దీన్, జానరావు, ఎ. సంజీవరెడ్డి, జి. శేషయ్య, కానిస్టేబుళ్లు ఎస్ఎస్. చారి, అశోక్ రావు, కె. జగన్నాథ్ రావ్. విఠల్ సింగ్, జె. ముకుంద్ రావ్, పి.రఘునాథ్, ఎంఎ జావిద్, జి. బాపురావ్, వేణుగోపాల్, బోజరాం, మోహన్ దాస్,
గణపతి, సాగిర్ అహ్మద్, కె. అశోక్, జె. సతీష్ బాబు,
మంగిలాల్, సి. రామరావు, అంకమ్ రావు, ఆర్. కబీర్ దాస్, ఎం. గోవింద్ రావ్, ఆర్. శంకర్, ఆర్. ఓంకార్, కె. సుభాష్, శివశంకర్, కె. రాజేశ్వర్, పూనమ్ చంద్, ఆర్. నర్సయ్య, ఆర్. నర్సయ్య, ఎ. భీంరాట్లు లు అమరులయ్యారు.