రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
By: Mohammad Imran
On
గొల్లపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి*
ఒకరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
గొల్లపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ద్విచక్రవాహనదారులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు., మండలం లోని గోవిందుపల్లె కు చెందిన అల్లూరి రాఘవరెడ్డి, వెల్గటూర్ మండలం లోని రాంనూర్ కు చెందిన బిదారి శ్రీకాంత్ లు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. రాఘవరెడ్డి బార్య సుగుణ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు., ప్రమాద స్థలాన్ని ధర్మపురి సి ఐ రామ్ నరసింహారెడ్డి పరిశీలించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు
Tags: