రక్తదానానికి ప్రతి ఒకరు ముందుకు రావాలి, ఎస్పీ అశోక్ కుమార్
రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
పోలీస్ అమరవీరుల సంస్మరణ లో భాగంగా రక్తదాన శిబిరం.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, అక్టోబర్ 30: రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ లో భాగంగా పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ గురువారం ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీలు వెంకటరమణ, రఘు చందర్, వివిధ సర్కిళ్ల సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, యువత స్వచ్ఛంద రక్తదానం చేశారు సుమారు 200 యూనిట్ల బ్లడ్ ను రెడ్ క్రాస్ సొసైటీ వారు సేకరించారు. అనంతరం ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పోలీస్ అమరవీరులను ఎప్పటికీ మర్చిపోకుండా, నిత్యం గుర్తు చేసుకోవడానికి జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీసులు చేపడుతున్న ఈ కార్యక్రమాలకు యువత నుండి అనూహ్య స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా తాజాగా శరీరంలోకి కొత్త రక్తం ఉత్పత్తి అయ్యి ఆరోగ్యంగా ఉంటామని సూచించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరపున అభినందనలు తెలిపారు. ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పోలీస్ అదికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటరమణ ,రఘు చందర్, డాక్టర్ దీపిక, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సైదులు, వేణు,సిఐ లు రామ్ నరసింహ రెడ్డి, రవి, కరుణాకర్, ఎస్ఐ లు,పోలీస్ సిబ్బంది, యువత, పాల్గొన్నారు.

