మాదక ద్రవ్యల నిర్ములన పై పోలీసుల వినూత్న కార్యక్రమం

మాదక  ద్రవ్యల నిర్ములన పై పోలీసుల వినూత్న కార్యక్రమం

 

మాదక ద్రవ్యాల నిర్మూలనపై IMG-20251125-WA0021 జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమం

జగిత్యాల

గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో ప్రతివ సంవత్సరం నిర్వహించే జాతర ఈ రోజు నుండి ప్రారంభమైంది. ఈ జాతరలో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. సుమారు నెలరోజుల పాటు కొనసాగనున్న ఈ జాతరను దృష్టిలో ఉంచుకొని, జగిత్యాల జిల్లా పోలీసులు సమగ్ర భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.

జాతర ప్రాంతానికి భారీగా చేరుకునే భక్తులలో మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం మరియు రవాణాపై అవగాహన పెంచడానికి, జిల్లా పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకుగాను, జాతర ప్రాంతానికి చేరుకునే ఆటో రిక్షాలపై “మాదక ద్రవ్యాల నిర్మూలన—మనందరి బాధ్యత” అనే సందేశంతో ప్రత్యేక ప్రచార పోస్టర్లు అంటించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

జిల్లాలో నిషేధిత మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి పౌరుడు సహకరించాలని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని జిల్లా పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో జగిత్యాల డీఎస్పీ డి.రఘు చందర్,సీఐ ధర్మపురి రాంనర్సింహరెడ్డి,ఎస్సై గొల్లపల్లి కృష్ణసాగర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు 

Tags: