యాజమాన్య హక్కులు లేకుండా 100 కోట్ల ఆస్తి కబ్జా, చర్యలు తీసుకోండి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

యాజమాన్య హక్కులు లేకుండా 100 కోట్ల ఆస్తి కబ్జా, చర్యలు తీసుకోండి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

యాజమాన్య హక్కులు లేకుండా 
రూ.100 కోట్ల ఆస్తి అక్రమంగా కబ్జా..

పెట్రోల్ డీసెల్,కిరోసిన్ పంపు కోసం కేటాయిస్తే.. వారసత్వ ఆస్తిగా పంపకాలు..

ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత...

కి బాలా అనుమానంగా ఉంది అని హై కోర్టు పేర్కొంది..

అక్రమ ఆస్తుల స్వాధీనం కోసం ముఖ్యమంత్రి కి లేఖ రాస్తున్న..

అక్రమంగా వినియోగిస్తున్న 20 గుంటల స్థలాన్ని మునిసిపల్ స్వాధీనం చేసుకొని, ప్రజావసరాల కు వినియోగించాలి..

మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి..

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పట్టణంలో యా వర్ రోడ్డు విస్తరణ ప్రధానం
1994 లో మాస్టర్ ప్లాన్ అమలుకోసం రోడ్డు 60 ఫీట్లు వరకు ఆమోదం పొందగా, 

సహజంగా భూసేకరణ చేస్తే నిజమైన యాజమాన్య హక్కులు ఉంటే, పరిహారం చెల్లించాలి..

రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న వారిని బుజ్జగించి, ఒప్పించి, మెప్పించి 
60 ఫీట్ల వరకు విస్తరించినం.
టవర్ రోడ్డు సైతం విస్తరించినం.

100 ఫీట్ల రోడ్డు విస్తరణ కోసం మునిసిపల్ లో ప్రతిపాదనలు చేసినా అప్పటి  ప్రభుత్వ పాలనలో అమలుకు నోచుకోలేదు. అనంతరం మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందింది.

న్యూ బస్టాండ్ వద్ద 1952 ప్రాంతంలో పెట్రోల్, డీజిల్, దుకాణం లేకపోవడం తో 
ప్రజా అవసరాల కోసం దారం వీర మల్లయ్య కు 20 గుంటల భూమిని మున్సిపల్ కేటాయించింది.

కేవలం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఔట్లెట్ ఏర్పాటు చేయడం కోసం కేటాయించారు.

పెట్రోల్ బంక్ కేవలం 4 గంటలు మాత్రమే ఉపయోగిస్తున్నారు.

1952 లో మున్సిపల్ 20 గుంటలు
పెట్రోల్ డీసెల్ కిరోసిన్ పంపు ఏర్పాటు కోసం కి బాల రు.2,000 విలువతో కేటాయించింది.

భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించాలని మున్సిపల్ కోరినా, దారం వీరమల్లయ్య జీవిత కాలంలో ఎటువంటి ఆధార పత్రాలు సమర్పించలేదు. కిబాల 1975 వరకు మున్సిపాలిటీకి సమర్పించలేకపోయారు.

దారం వీరమల్లయ్య మరణంనంతరం వారి వారసులు కిబాలా ను తెర పైకి తీసుకు వచ్చారు.

కిబాల 1952 లో కేటాయించినట్లు పేర్కొన గా, 1958 లో పత్రం తయారీ అయినట్లు తేలింది.

మున్సిపాలిటీ నోటీసులు జారీ చేయటంతో ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించడం జరిగింది 

అక్రమనదారులు ఇంజెక్షన్ కోసం వెళ్ళారు కానీ ఏనాడు యాజమాన్య హక్కుల
టైటిల్ కోసం కోర్టులను ఆశ్రయించలేదు.

దారం వీర మల్లయ్య వారసులకు కోర్టులు ఎక్కడ కూడా యాజమాన్య హక్కులు నిర్ధారించలేదు.

2004 లో మున్సిపల్ ఆస్తులు రక్షించాలి..అక్రమ దారులను తొలగించాలని, జగిత్యాల మున్సిపల్ సబ్ కమిటీ వేయగా, వివిధ అంశాలు పరిశీలించి, కి బాల అనుమాస్పదంగా ఉందని తేల్చారు. 

 భూమి కూడా కేవలం పెట్రోల్ డీసెల్ కిరోసిన్ కోసం మాత్రమే కేటాయించారు.

పెట్రోల్ బంక్ కేవలం 4 గుంటల్లో మాత్రమే ఏర్పాటు చేశారని, మిగిలిన 16 గుంటల భూమి స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ కౌసిల్  నంబర్ 140 ద్వారా తీర్మానం చేసింది.

యాజమాన్య హక్కులు లేకుండానే క్రయ, విక్రయాలు చేశారు.

వీరమల్లయ్య సోదరుడు పురుషోత్తం వారసత్వ ఆస్తిగా భాగాలు చేసుకున్నారు.

రెవెన్యూ రికార్డులలో 1954- 55 కాశ్ర పహాని లోగానీ, పహానిలో గాని పేరు నమోదు కాలేదు. కేవలం కబ్జా కాలంలో మాత్రమే పేర్కొన్నారు.

మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు యాజమాన్య హక్కులను గమనించడం లేదు.

రోడ్డు విస్తరణకు పెట్రోల్ బంక్ వద్ద జనరేటర్ గది తొలగించాలని నోటీసు ఇస్తే, మంచాల కృష్ణ  రిట్ పిటిషన్ వేశారు.

పెట్రోల్ పంపు కోసం కేటాయించిన భూమి మినహా 16 గుంటల భూమి స్వాధీనం చేసుకోవాలనే మున్సిపల్ తీర్మానం 140 రద్దు చేయాలని మరో రిట్ వేశారు.

మున్సిపల్ 140 తీర్మానం రద్దు చేయాలనే రిట్ చెల్లదని,  యాజమాన్య హక్కుల కోసం సివిల్ కోర్టు కు వెళ్లాలని కోర్టు ఆదేశించింది.

రోడ్డు విస్తరణకు సంబంధించి ప్రొసీజర్ ఫాలో కావాలని మాత్రమే కోర్టు సూచించింది.

1952 లో పెట్రోల్ డీసెల్, కిరోసిన్ పంపు కోసం భూమి కేటాయించినట్లు గా పేర్కొనగా, 1958 లో అమలు చేసినట్లు గా ఉందని కోర్టు తెలిపింది.

కిబాలను దారం వీర మల్లయ్య మున్సిపల్ కు జీవిత కాలం సమర్పించకాపోవడం కిబాల అనుమానంగా ఉందని ప్రకటించింది.

దారం పురుషోత్తం ఒక సందర్భంలో  యాజమాన్య హక్కులు లేవని కబ్జాలో మాత్రమే ఉన్నామని చెప్పారు.

దారం వీర మల్లయ్య కబ్జా లో మాత్రమే ఉన్నారని, యజమాని అయి ఉంటే పట్టదార్ కాలం నంబర్ 8 లో నమోదు చేసేవారని,
పిటిషనర్ కోర్టుకు సమర్పించిన పత్రంలో సైతం పట్టాదారు కాలమ్ లో పేరు లేనిది సమర్పించారని కోర్టు పేర్కొంది.

సహజంగా మున్సిపాలిటీ ప్రభుత్వ అనుమతి లేకుండ భూమి కేటాయించరాదు. ప్రభుత్వ అనుమతి పొందినట్టు ఏవిధమైన ఆదారం లేదు.

మున్సిపల్  కౌన్సెల్ చేసిన తీర్మానం  ఇప్పటికీ తీర్మానం అమల్లో ఉంది.

దారం వీర మల్లయ్య వారసులు యాజమాన్య హక్కులు ధృవీకరించుకోలేదు.
పహనీలో  పేరు నమోదు కాలేదు..
కి బాలా అనుమానంగా ఉంది..

యాజమాన్య హక్కుల ధృవీకరణ కోసం కోర్టు కక్షిదారులకు సూచనలు చేసింది.

 కోర్టు తీర్పు వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది..ఇప్పటి వరకు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదు.

ఉద్దేశపూర్వకంగా కోర్టును ఆశ్రయించడం లేదు..

యాజమాన్య హక్కులు ధృవీకరించుకోకపో తే 20 గుంటల పై ఆస్తి హక్కు ఉండదు.

ఏ విధమైన యాజమాన్య హక్కులు లేకుండా  సుమారు 100 కోట్ల ఆస్తిని అక్రమంగా అనుభవిస్తున్నారు.

హై కోర్టు ఉత్తర్వులు సైతం దారం వీర మల్లయ్య వారసులకు వ్యతిరేకంగా ఉన్నాయి..

మున్సిపాలిటీ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.

పట్టణంలో రోడ్డు విస్తరణ లో పెట్రోల్ బంక్ జనరేటర్ ప్రధాన ఆటంకంగా మారింది.

పెట్రోల్, డీజిల్, కిరోసిన్ కోసం కేటాయించిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించడం చట్టపరంగా చెల్లదు.

నిజంగా యాజమాన్య హక్కులు ఉంటే కోర్టును ఎందుకు ఆశ్రయించలేదు..

జగిత్యాల పట్టణంలోని మున్సిపాలిటీకి చెందిన సర్వే నంబర్ 138 లో ఏవిధమైన యాజమాన్య హక్కులు లేకుండా అక్రమ స్వాధీనంలో ఉన్న ఆస్తులను మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు లేఖలు రాస్తామని అన్నారు.

ప్రభుత్వ ఆస్తులు రక్షింప చేయడం ప్రతి పౌరుడి, ప్రతి ప్రజా ప్రతినిధి బాధ్యత..

రాజ్యంగంలో నాలుగో పిల్లర్ గా పేర్కొన్న పాత్రికేయులకు  కూడా ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉంది.IMG-20251028-WA0041

Tags: