నేడు టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కమిటీ విస్తృత స్థాయి సమావేశం
*నేడు టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ విస్తృత స్థాయి సమావేశం*
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య
రాష్ట్ర కమిటీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ పై సమీక్ష
చురకలు ప్రతి
నిధి
హైదరాబాద్,(నవంబర్ 14):
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీ డబ్ల్యూ జే ఎఫ్) రాష్ట్ర విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశం ఈనెల 15వ తేది శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్బీనగర్ కమ్యూనిటీ సెంటర్లో ఈమేరకు ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇటీవల మహాసభలు జరిగిన ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు, ఇంకా పెండింగ్ లో ఉన్న మహాసభలు జరగని జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులు హాజరు కావాలని సోమయ్య కోరారు.ప్రధానంగా ఫెడరేషన్ రాష్ట్ర కమిటీలో ఇటీవల నెలకొన్న తాజా గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో సంఘం నియమ నిబంధనల (బైలా)కు విరుద్దంగా వ్యవహరిస్తున్న జనరల్ సెక్రటరీ పనితీరుపై చర్చ తోపాటు,జిల్లాల సభ్యత్వాలు- జిల్లాల మహాసభలు-రాష్ట్ర మహాసభలు, 2025 మీడియా డైరీ, భవిష్యత్ కార్యాచరణ అనే అంశాలు ఎజెండా గా చర్చకు వస్తాయని సోమయ్య ఆప్రకటనలో వెల్లడించారు.సోమయ్య వెంట ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లాల జగన్, బండి విజయ్ కుమార్,రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, నాయకులు కె. బాబూ రావు తదితరులు ఉన్నారు.

