మావొయిస్ట్ కీలక నేతల లొంగుబాటు
మావొయిస్ట్ కీలక నేతల లొంగు బాటు
చురకలు ప్రతి నిధి
హైదరాబాద్, అక్టోబర్, 28
మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్నతోపాటు మరో కీలక నేత బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు.
మాది లొంగుబాటు కాదు - చంద్రన్న
ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పని చేశాను, భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పని చేస్తాననీ మావోయిస్టు సీనియర్ నేత చంద్రన్న అన్నారు.
ఇవాళ మరో సీనియర్ నేత బండి ప్రకాష్ తో తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా సిద్ధాంతం ఓడిపోలేదు, ఓడించడం ఎవరితరం కాదన్నారు. మా భావాజాలంతో భవిష్యత్తులో మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉందనీ, ప్రస్తుతం అనారోగ్య కారణం వల్ల ప్రజల మధ్య ఉండి సేవ చేయాలనుకున్నాననీ అందుకే పార్టీ నుండి బయటకు వచ్చానని అన్నారు.
ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్ జీ కొనసాగు తున్నాడని,సిద్ధాంత పరంగా తాను దేవ్‌జిని సపోర్ట్ చేస్తున్నాననీ తెలిపారు. ఉద్యమం లో నుంచి బయటకు వచ్చేముందు ఆయుధాలను పార్టీకి ఇచ్చి వచ్చాననీ అన్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఏమీ ఆశించడం లేదన్నారు.


