ఎన్కౌంటర్ లో మరణించింది హిడ్మానే నా....

ఎన్కౌంటర్  లో మరణించింది హిడ్మానే నా....

హిడ్మా ఎన్ కౌంటర్....!

చురకలు ప్రతినిధి, మారేడుమిల్లి:

 

మోస్ట్ మావోయిస్ట్ లీడర్, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హడ్మా పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు పార్టీ నక్సల్స్, పోలీసుల మధ్య మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలోని టైగర్ క్యాంప్ ప్రాంతంలో గల పుల్లగండి అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

అయితే చనిపోయిన ఆరుగురు నక్సల్స్ లో కరడుగట్టిన ప్రముఖ మావోయిస్టు నేత హిడ్మా కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హిడ్మా మృతిని పోలీసులు అధికారికంగా ఇప్పటి వరకైతే ధ్రువీకరించలేదు. ఇదే ఘటనలో మరో అగ్రనేత ఆజాద్, హిడ్మా భార్య రాజీ కూడా చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కాగా ఎన్కౌంటర్ ఘటనలో ‘సమీక్ష’కు అందిన ఓ ఫొటో ఎన్కౌంటర్ లో చనిపోయిన్టలు తెలుస్తున్న హిడ్మాదిగా తెలుస్తోంది. 
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా అలియాస్ సంతోష్ 26 ఘటనల్లో భద్రతా బలగాలపై దాడులకు నాయకత్వం వహించాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కు హిడ్మా నాయకత్వం వహిస్తున్నాడు. హిడ్మాపై రూ. 50 లక్షల నగదు రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. భద్రతా బలగాలపై మెరుపు దాడులకు దిగి మట్టుబెట్టడంలో హిడ్మా ప్రసిద్ధి గాంచాడు. కొన్ని ముఖ్య ఘటనలను తీసుకుంటే 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను చంపిన ఘటనలో, దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సహా 27 మందిని చంపిన ఉదంతంలో హిడ్మాది ప్రధాన పాత్రగా పోలీసు రికార్డులు ఉన్నాయి.

మావొయిస్ట్ పార్టీ లోని కేంద్ర కమిటీ నాయకులు, పెద్ద ఎత్తున క్యాడర్ ఇటీవల లొంగిపోవడం, హెడ్మా లొంగిపోతున్నట్లు, ప్రచారం జరుగడం, అతని కోసం కేంద్ర బాలగాలు పెద్ద ఎత్తున ఆపరేషన్ ప్రారంభించడం వంటి సంఘటనల నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ సంఘటన చర్చ నియామశంగా మారిందిFB_IMG_1763446839359

 

Tags: