జిల్లా అధ్యక్షునిగా అక్బర్ హుస్సేన్

జిల్లా అధ్యక్షునిగా అక్బర్ హుస్సేన్

జిల్లా అధ్యక్షునిగా అక్బర్ హుస్సేన్ ఎన్నిక.

జగిత్యాల, అక్టోబర్ 26 : జగిత్యాల జిల్లా ఆటో మొబైల్ మెకానిక్ వర్క్ షాప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుని ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా అధ్యక్షునిగా అక్బర్ హుస్సేన్ తన సమీప ప్రత్యర్థి సంపత్ రెడ్డిపై 11 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం అక్బర్ హుస్సేన్ మాట్లాడుతూ ఆటోనగర్ సాధనకు సభ్యులందరికీ  సహకారంతో ముందుకెళ్తానని, ప్రతి యూనియన్ సభ్యునికి రూ.1లక్ష  ప్రమాదభీమా కల్పిస్తానని, యూనియన్ సభ్యులకు రుణాలు వచ్చేలా చూస్తానని, ప్రతి మూడు నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు నిర్వహిస్తామని, యూనియన్ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. అనంతరం యూనియన్ సభ్యులు అక్బర్ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు  తెలిపారు.IMG-20251026-WA0140

Tags: