జూబ్లీహిల్స్ లో విజయం పై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
జూబ్లీహిల్ లో విజయంపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
ఈసందర్భంగా తహసిల్ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు.
జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మాజీ ఛైర్పెర్సన్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఓటర్లు కు పార్టీ విజయం కోసం కష్ట పడిన నాయకులకు , కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అనంతరం
*భారత
తొలి ప్రధాని దివంగత జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళి*
భారత మొట్టమొదటి ప్రధాని చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం చిల్డ్రన్స్ డే సందర్భంగా జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈసందర్భంగా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ.. పౌరులు భావితరాల అభివృద్ధి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్స్ దాసరి లావణ్య ప్రవీణ్, కూతురు రాజేష్, బొడ్ల జగదీష్, జగన్,మైనార్టీ అధ్యక్షులు ముజ్జు బాయ్, మాజీ కౌన్సిలర్స్, యూత్ నాయకులు, పట్టణ నాయకులు, మహిళ నాయకులు, మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

