బాల సదన్ ను సందర్శించిన జడ్జి

బాల సదన్ ను సందర్శించిన జడ్జి

బాల సదన్ శిశు గృహాలను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జ్ కమ్  జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి 

చురకలు విలేఖరి

జగిత్యాల


జగిత్యాల పట్టణ కేంద్రంలోని బాల సదన్ శిశు గృహాలను  శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ సీనియర్ సివిల్ జడ్జ్ కె.  వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ సార్  సందర్శించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో బాలసదన్ లోని సిబ్బందితో కలిసి మాట్లాడారు., పిల్లలు బాల్యం నుండే మంచి నడవడికను అలవర్చుకోవాలని పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు అలాగే వివిధ సౌకర్యాలను పరిశీలించారు, డార్మిటరీలు, మరుగుదొడ్లు, వంటశాలలు మరియు స్టోర్‌రూమ్‌లు, పరిశుభ్రత, మరియు పిల్లలకు అందించే ఆహారం నాణ్యతగా ఉండేలా చూడాలని, దోమల బెడద వంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని కోరారుఎలాంటి న్యాయ పరమైన సలహాలు అవసరమైన సంప్రదించాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించారు.ఈ కార్యక్రమం లొ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్. కె. చంద్ర మోహన్ ,  డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సిల్ పి. సతీష్,  విజయ్ కృష్ణ, . అనురాధ అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సిల్ IMG-20250517-WA0109 సూపరిండెంట్ వెంకన్న పాల్గొన్నారు.

Tags: