జిల్లాలో ఎస్ఐలకు స్థానచలనం
By: Mohammad Imran
On
జిల్లాలో ఎస్ఐలకు స్థానచలనం.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, జూన్ 19: జగిత్యాల జిల్లాలో పని చేస్తున్న పలువురు ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ గురువారం జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల టౌన్ ఎస్ఐగా పని చేస్తున్న పి. గీతను సారంగాపూర్ కు, ధర్మపురి ఎస్ఐగా పని చేస్తున్న వెల్గటూర్ కు, కోరుట్ల ఎస్ఐగా పని చేస్తున్న జగిత్యాల డిఎస్బికి, సారంగాపూర్ ఎస్ఐగా పని చేస్తున్న పి. దత్తాత్రిని జగిత్యాల డిసిఆర్బీకి, గొల్లపల్లి ఎస్ఐగా పని చేస్తున్న సిహెచ్. సతీష్ ను జగిత్యాల డిఎస్బికి, వెల్గటూర్ ఎస్ఐగా పని చేస్తున్న ఆర్. ఉమాసాగర్ ను జగిత్యాల విఆర్ కు, నిజామాబాద్ లో ఎస్ఐగా పని చేస్తున్న ఎం. చిరంజీవిని కోరుట్లకు, నిర్మల్ జిల్లా కడెం లో ఎస్ఐగా పని చేస్తున్న కృష్ణసాగర్ ను గొల్లపల్లికి బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Tags: