తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతుల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదు. రైతులు ఆందోళన పడవద్దు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.  రైతుల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదు.  రైతులు ఆందోళన పడవద్దు.  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.

రైతుల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదు.

రైతులు ఆందోళన పడవద్దు.

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, మే 22: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతుల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, రైతులు ఆందోళన పడవద్దని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో 428 వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా నేటి వరకు 65,554 మంది రైతుల నుండి 3.88 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని,దీనికి గాను 723.46 కోట్ల రూపాయలను 54132 మంది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.
మిగిలిన రైతులకు కూడా డబ్బులు జమ చేస్తామని, 
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతులు తమ వడ్లు ఎప్పుడూ కొనుగోలు చేస్తారో అని పడిగాల్పులు కాయల్సిన పరిస్థితి ఉండేదని,కానీ మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు ధరతో గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్ కు 2320 రూపాయలు, సాధారణ రకానికి 2300 రూపాయలు, సన్న రకాలకు 5వందల బోనస్ లు అదనంగా చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా 15 శాతం వడ్లు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయని, బుధవారం నుండి కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడవడం జరిగిందనీ,తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, మిగిలిన ఆ 15 శాతం వడ్లను కూడా హామలీల సంఖ్యను పెంచి కొనుగోళ్ళు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ పాలకులు రైతుల గురించి పట్టించుకోలేదని,గతంలో మంత్రిగా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్ వద్దకు రైతులు వెళ్ళి మిల్లర్లు కటింగ్ పేరుతో దోచుకుంటున్నారని విన్నవించినా వెళ్లి మిల్లర్లతో మాట్లాడుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ రైతులకు ఇబ్బందులు కలిగించకుండా, ఎక్కడ కటింగ్ లేకుండా పూర్తిగా పారదర్శకతతో జిల్లా అధికారుల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు చేపడుతున్నామన్నారు.
రైతుల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని,గత ప్రభుత్వంలో రైతులుకు ట్రక్ షీట్లు,ధర్మ కంట రసీదులు ఇలాంటివి ఇచ్చేవారు కాదని,ఒక సంచికి 6 నుండి 9 కిలోల వరకు కటింగ్ చేసేవారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో నిబంధనలకు అనుగుణంగా పూర్తిగా  అధికారుల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇంకా ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వం స్థలంలో కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న రోజుల్లో కూడా విత్తనాలు, ఎరువుల సరఫరాలో జాప్యం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.IMG-20250522-WA0148

Tags: