జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మకమైన పోలీస్ సేవా పతకాలు. అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మకమైన పోలీస్ సేవా పతకాలు.
అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, జూన్ 1 : పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించిన పలువురు పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాలను అందుకోనున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ పతకాలకు ఎంపిక అయిన సిబ్బంది ని జిల్లా ఎస్పీ అభినందించారు. విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే వారికి గుర్తింపు వస్తుందన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించి విధినిర్వహణలో నిజాయితీని కనబరుస్తూ మరెన్నో పథకాలు అందుకోవాలని ఎస్పి ఆకాంక్షించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు ఏఆర్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న సిబ్బంది ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఉత్తమ సేవా పథకానికి ఏఎస్ఐ లు రామస్వామి, శ్రీనివాస్ తో పాటు సేవా పథకానికి ఏఎస్ఐ జమీల్ అహ్మద్,నరసింహారెడ్డి, బిక్షపతి,సత్తయ్య, శ్రీనివాస్,హెడ్ కానిస్టేబుళ్లు మల్లారెడ్డి, నీల్య నాయక్, డి.శ్రీనివాస్, జి.రవి,మహమ్మద్ ఇలియాస్ అహ్మద్, ఎస్.నాగన్న, మల్లారెడ్డి,రాజమౌళి, తనోబా, బి. ప్రకాశ్ లకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.