నంబళ్ల.... మూడేళ్ళే క్రితం ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ.. మావోయిస్ట్ చీఫ్ బసవరాజు ఇంటర్వ్యూ సారంశం...

నంబళ్ల.... మూడేళ్ళే క్రితం ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ..  మావోయిస్ట్ చీఫ్ బసవరాజు ఇంటర్వ్యూ సారంశం...

నంబళ్ల.... మూడేళ్ళే క్రితం ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ..

మావోయిస్ట్ చీఫ్ బసవరాజు ఇంటర్వ్యూ సారంశం...


(నోట్: సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు విదేశీ పాత్రికేయుడికి ఇచ్చిన తొలి ఇంటర్వ్యూను పాఠకులకు పరిచయం చేస్తున్నాం. జర్నలిస్టు అల్ఫ్ బ్రెనన్ అడిగిన ప్రశ్నలకు కామ్రేడ్ బసవరాజు చాలా సవివరమైన సమాధానాలు ఇచ్చాడు. వాటిని సంక్షిప్తీకరించి అందిస్తున్నాం. పూర్తి పాఠాన్ని చదవడం ద్వారా పార్టీ అవగాహనను సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతారు. సం. )

ప్ర. భారతదేశంలో ఏ ఉత్పత్తి విధానం ఉందని మీ పార్టీ నిర్ధారిస్తుంది? అర్ధభూస్వామ్యమా, లేదా పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానమా?
కామ్రేడ్ బసవరాజు: నక్సల్బరీ సాయుధ రైతాంగ విప్లవ వెల్లువకు తొలిసంజలోనే కామ్రేడ్ సీఎం, కామ్రేడ్ కేసీల నాయకత్వంలో విప్లవ కమ్యూనిస్టులు ఎంఎల్ఎం సిద్ధాంత వెలుగులో భారతదేశంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి ఉనికిలో ఉన్న వర్గ వైరుధ్యాలను నిర్దిష్టంగా విశ్లేషించారు. భారతదేశం ఒక అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థ అనీ, ఇక్కడ విప్లవ మార్గం దీర్ఘకాల ప్రజాయుద్ధంగా వుంటుందని, ముందుగా నూతన ప్రజాస్వామిక విప్లవ దశను పూర్తి చేసి సోషలిస్టు దశకు పురోగమిస్తుందని నిర్ధారించారు. మా ఐక్య పార్టీ సీపీఐ (మావోయిస్టు) ఈ రాజకీయ, మిలిటరీ పంథాను కొనసాగిస్తున్నది.
మా దేశం పెట్టుబడిదారీ సమాజమా? లేక అర్ధవలస-అర్ధభూస్వామ్య సమాజమా? అనే విషయంపై మార్క్సిస్టుల్లో, రివిజనిస్టులు, నయా రివిజనిస్టులలో, బూర్జువా మేధావులలో, ఎన్జీఓలలో పెద్ద ఎత్తున చర్చలు, వివాదం నడుస్తున్న నేపథ్యంలో 2011 నుండి వివిధ రాష్ట్రాల్లో మా పార్టీ చేపట్టి నిర్వహించిన ఉత్పత్తి సంబంధాల అధ్యయనాల రిపోర్టులను విశ్లేషించి, సంశ్లేషించి డిసెంబర్ 2020లో జరిగిన మా కేంద్రకమిటీ 6వ కొనసాగింపు సమావేశం “భారతదేశ ఉత్పత్తి సంబంధాలలో మార్పులు, మన రాజకీయ కార్యక్రమం” పేరుతో ఒక వివరమైన దస్తావేజును జారీచేసింది. ఈ దస్తావేజులో మా దేశం ఇప్పటికీ అర్ధవలస-అర్థభూస్వామ్య సమాజంగానే కొనసాగుతున్నదని నిర్ధారించాం. అయితే సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య అనుకూల వికృత పెట్టుబడిదారీ మార్పులు గణనీయంగానే జరిగాయని చెప్పాం. అందుకనుగుణంగా ఎత్తుగడలను రూపొందించుకునేలా మా రాజకీయ కార్యక్రమాన్ని పొందుపరిచాం. బహుశా ఈ దస్తావేజును మీరు చూసే వుంటారు. 1947 తర్వాత మా దేశ ఆర్థిక, రాజకీయ నియంత్రణ ప్రధానంగా మొదట బ్రిటన్, అమెరికా చేతిలోకి, తర్వాత సోవియట్ సామ్రాజ్యవాదం చేతిలోకి తిరిగి మళ్ళీ అమెరికా చేతిలోకి మారింది. మా దేశంపై ఆర్థికంగా, రాజకీయంగా వివిధ స్థాయిల్లో, వివిధ సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్యం కొనసాగుతున్న ఫలితంగా భారత సమాజం అనేక సామ్రాజ్యవాద శక్తుల పరోక్ష పాలనా, దోపిడీ, ఆజమాయిషీలో వున్న అర్ధవలస-అర్ధభూస్వామ్య వ్యవస్థగా మార్పు చెందింది.
1947 నుండి గత 75 సంవత్సరాలుగా సామ్రాజ్యవాదుల, దోపిడీ పాలకవర్గాల ప్రయోజనాలకు అనుగుణంగానే అనేక వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగ విధానాలు, బూటకపు భూసంస్కరణలు, పంచవర్ష ప్రణాళికలు, హరిత విప్లవం తదితరాలన్నీ అమలు చేయబడ్డాయి. ఆ తర్వాత ఎల్పీజీ విధానాల అమలులోకి వచ్చాయి. డిస్ఇన్వెస్ట్మెంట్, డిఇండస్ట్రియలైజేషన్, డిరెగ్యులేషన్లు అమలులోకి వచ్చాయి. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో పబ్లిక్ రంగ సంస్థలను కారుచౌకగా సామ్రాజ్య వాదులకు, దళారీ పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారు. దీనితో అసంఘటిత రంగం, ప్రైవేట్ రంగం ప్రధాన రంగాలుగా మారాయి. కార్మికుల శ్రమ దోపిడీ మరింత తీవ్రమైంది. వారు పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాచివేయబడుతున్నాయి. కార్మికుల క్యాజువల్ కాంట్రాక్ట్ పద్ధతులు ప్రధానమైపోయాయి. నేటికి కొనసాగుతున్న అర్ధవలస సంబంధాలే ఈ కష్టాలు, కడగండ్లకు కారణం. ఎల్పీజీ పాలసీల అమలుకు ముందు 1960ల చివర నుండి సోవియట్ సోషల్ సామ్రాజ్యవాదం సహాయం పేరుతో భారత ప్రభుత్వరంగ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం సాగించింది. 1980ల నుండి ఈ క్రమం తగ్గుముఖం పట్టింది. 1970లలో ప్రభుత్వరంగ పెరుగుదలతో పాటే దాన్ని ఉపయోగించుకుంటూ దళారీ నిరంకుశ బూర్జువావర్గం కూడా పెరిగింది.
సామ్రాజ్యవాద ప్రయోజనాలను అందులో భాగంగా భార దళారీ పాలకవర్గాల ప్రయోజనాలను ఈడేర్చుకోవడానికి 1985 నుంచి 1991 వరకు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల మొదటి దశ కొనసాగింది. 1991 నుంచి రెండవ దశ కొనసాగుతున్నది.
సామ్రాజ్యవాద పథకాలకు అనుగుణంగా ప్రపంచీకరణ మొదటి దశలో కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా వ్యవసాయాన్ని వాణిజ్యీకరించడంతో మొదలై పలు ప్రాంతాలలో విస్తరిస్తూ వచ్చింది. కార్పొరేట్ కంపెనీలు కాంట్రాక్టు భూముల్లో వ్యవసాయంపై పూర్తి నియంత్రణ సాధిస్తూ వచ్చాయి.
ఇక భారత అర్ధవలస-అర్ధభూస్వామ్య వ్యవస్థపై ప్రపంచీకరణ దాడి రెండవ దశను చూద్దాం. ఈ కాలంలో అర్ధభూస్వామ్యంలో చోటు చేసుకున్న గణనీయమైన మార్పుల కారణంగా భూస్వామ్య ఆధిపత్యపు గత రూపాల స్థానంలో నూతనంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర ‘పార్టీ-సహకార సంస్థ-పంచాయితీ-పోలీసు’ వ్యవస్థలు కుమ్మక్కైన విస్తృత సమిష్టి రూపం వచ్చింది. అలాగే నిరంకుశ పెట్టుబడిదారీ విధానం, అర్ధభూస్వామ్యం కలిసిన ఒక ముఖ్యమైన సంస్థాగత రూపమే సహకార బ్యాంక్ కాగా సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల మదుపులు, స్థానిక అర్ధభూస్వామ్య మిగులుల మిశ్రమమే ఈ సహకార బ్యాంకుల సహకార పెట్టుబడి. వీటి ద్వారా ప్రభుత్వ ఆస్తులు/నిధుల పునాదిగా స్థానిక ఆధిపత్యం, దోపిడీల నూతన విధానం రూపొందింది. నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే “దున్నేవారికే భూమి” ఆధారంగా భూస్వాములకు యెలాంటి నష్టపరిహారం లేకుండా భూమిని స్వాధీనం చేసుకోవడం, భూస్వాముల భూములను వ్యవసాయ కూలీలకు, నిరుపేద రైతులకు, కింది మధ్యతరగతి రైతులకు తిరిగి భూపంపకం చేయడం, సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థల, పెట్టుబడిదారీ భూస్వాముల, దళారీ నిరంకుశ పెట్టుబడిదార్ల, ప్రభుత్వ సంస్థల వ్యవసాయ క్షేత్రాలను, ప్లాంటేషన్లను ఆక్రమించుకొని సహకార వ్యవసాయాన్ని చేయడం, విప్లవ ప్రజా ప్రభుత్వాలు జాతీయం చేయడం, “వ్యవసాయాన్ని పునాదిగా తీసుకొని, పరిశ్రమలను నాయకత్వంలో ఉంచే” సూత్రంపై, “రెండు కాళ్ల మీద నడిచే” వరుస విధానాలపై ఆధారపడి దేశాన్ని పారిశ్రామికం చేయడం, సహకార వ్యవసాయ ఉద్యమాన్ని, వ్యవసాయ సహకార సంఘాలను ప్రోత్సహించడం, పెంపొందించడం, సామ్రాజ్యవాద సంస్థల, కంపెనీల, దళారీ నిరంకుశ బూర్జువా వర్గ కంపెనీల, ప్రభుత్వ భూములను జాతీయం చేయడం, వారి ఆస్తులను, బ్యాంకులను స్వాధీనం చేసుకోవడం, దేశీయ, విదేశీ అప్పులను, అసమాన ఒప్పందాలను రద్దు చేయడం నిరుద్యోగాన్ని నిర్మూలించడం తదితర జాతీయ విముక్తి, ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాలను నెరవేర్చగలం.

ప్ర. మీ పార్టీ, పీఎల్డీఏ పని చేసే అనేక ప్రాంతాలలో ఎంతో సమృద్ధమైన జీవవైవిధ్యం ఉంది, అరుదైన ముఖ్యమైన మొక్కలు, అటవీ జంతుజాలం ఉన్నాయి. ఈ ప్రాంతాల సంరక్షణ పట్ల, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం పట్ల స్థూలంగా పార్టీ వైఖరి ఏమిటి?
కామ్రేడ్ బసవరాజు: మా పార్టీ నాయకత్వంలో విప్లవోద్యమం కొనసాగుతున్న ప్రాంతాలు అత్యంత సమృద్ధమైన జీవవైవిధ్యంతో కూడినవి. పచ్చని అడవులు, జీవ నదులతో కూడిన ఈ ప్రాంతాల్లో లెక్కలేనంత వృక్ష సంపద, ఔషదీయ వనమూలికలు, వన్య ప్రాణులు, రంగు రంగుల పక్షి జాతులు, పాలిచ్చే జంతువులు, క్రిమి కీటకాలు, నదులు, కాలువలలో వుండే జలచరాలు, ఉభయచరాలు, వందలాది రకాల చేపలు, అడవులలో లభించే డజన్ల కొద్ది లఘు అటవీ ఉత్పత్తులు, వివిధ రకాల దుంపలు, పండ్లు, కాయలనిచ్చే పొదలు, వృక్షాలు, సాంప్రదాయ పద్ధతుల్లో సంరక్షింపబడిన వేలాది రకాల వరి వంగడాలు, పప్పు దినుసులు, నూనె దినుసులు, తృణధాన్యాలు అపారంగా వున్నాయి. అమూల్యమైన, అద్భుతమైన, అనుపమానమైన, సమతుల్యమైన, ప్రకృతి సహజ సిద్ధమైన జీవవైవిధ్యానికి సామ్రాజ్యవాదుల నుండి, దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల నుండి చాలా కాలంగా ఎనలేని ముప్పు వాటిల్లుతూ వస్తున్నది. దోపిడీ పాలకవర్గాల ప్రజా వ్యతిరేక, సామ్రాజ్యవాద
ప్రాయోజిత విధానాల కారణంగా ఈ జీవవైవిధ్యం, పర్యావరణం విధ్వంసానికి గురవుతున్నాయి. పిడికెడు మంది దేశ, విదేశీ ఘరానా దోపిడీదారుల లాభాపేక్షకు ప్రకృతిని బలి కానివ్వరాదు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ, పర్వావరణాన్ని పరిరక్షిస్తూ, ప్రకృతి సంపదలను, వనరులను మానవ జీవన పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి సమతుల్యంగా ఉపయోగించుకోవాలి.
అయితే పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సమతుల్యత మరోవైపు మానవ జీవన పరిస్థితులను మెరుగుపర్చుకోవడం యీ రెండు పరస్పర ఆధీనమైనటువంటివి. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం చేస్తున్న వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడాలి. నూతన ప్రజాస్వామిక విప్లవం ఈ సమస్య శ్వాశత పరిష్కారానికి మౌలికమైన ప్రాతిపదికను ఏర్పరుస్తుంది.
మా దేశ జీవవైవిధ్యాన్ని సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలు ఎలా ధ్వంసం చేస్తున్నాయో ఉదాహరణలు చూడండి! ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వందలాది గ్రామాలలో వేలాది రైతుల నుండి వ్యవసాయ శాస్త్రవేత్త డా. రిఛారియా 22,000లకు పైగా వరి వంగాడాలను, 1,800లకు పైగా ఆకు కూరలను సేకరించి వాటి జర్మ్ ప్లాస్క్ ను ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని ఇందిరా గాంధీ జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 1950, 60లలో భద్రపరిచారు. ఇందులో తక్కువ నీటితో పండేవి, తక్కువ గడ్డినిచ్చేవి, ఎక్కువ గడ్డినిచ్చేవి, సువాసనలు వెదజల్లే, పొడవైన, పొట్టి, సంవత్సరంలోని ఏ కాలంలోనైనా పండే ఇలా అనేక రకాల వంగడాలు ఇందులో వున్నాయి. అయితే మా దేశ దళారీ పాలకుల కుమ్మక్కుతో ఈ వరి వంగడాల జర్మ్ ప్లాస్క్ ను అమెరికా తదితర దేశాల బహుళజాతి కంపెనీలు దొంగలించుకుపోయాయి. మనీలాలోని ఇంటర్నేషనల్ రైన్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఎ)లలో అభివృద్ధి చేశామని చెప్తూ ఇలా దొంగలించుకుపోయిన వంగడాలను వివిధ పేర్లతో (ఐఆర్-36, ఐఆర్-72 తదితర) బహుళజాతి కంపెనీలు భారత్ లాంటి అనేక దేశాల్లో అమ్ముకుని భారీగా లాభాలు గడిస్తున్నాయి. విత్తనాల కోసం ప్రతి సంవత్సరం బహుళజాతి కంపెనీలపై ఆధారపడేలా చేస్తున్నారు.
ఇన్ని వేల రకాల విత్తనాల అభివృద్ధి సంరక్షణ వెనుక వున్న గొప్ప చారిత్రాకానుభవాన్నిందించే అసలు కథనం చాలా అసక్తికరమైనది. అది ప్రపంచానికి తెలియాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రైతాంగ ప్రజానీకం అక్తి అనే పండుగ జరుపుకుంటారు. ఆ రోజు యువకులంతా కోలాటం వేస్తూ ప్రతి ఇంటి నుండి ధాన్యం అడుక్కుంటారు. ఊరంతటి నుండి సేకరించిన ధాన్యాన్ని కలిపి ఊరుమ్మడి స్థలంలో పంట వేసేవారు. పంట పండే క్రమంలో సహజంగానే కొన్ని కొత్త రకం వంగడాలు పుట్టుకొస్తాయి. తిరిగి వాటిని విడిగా సేకరించి పంట వేసేవారు. అలా ప్రతి సంవత్సరం ప్రతి ఊరులోను కొత్త రకం లక్షణాలు కలిగిన వంగడాలు తయారయ్యేవి. అలా ప్రతి గ్రామం ఒక వ్యవసాయ పరిశోధనాశాలగా, ప్రతి రైతు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా అన్ని తదితరాలు ఇంకా అస్థిత్వంలో వున్నాయి. ఈ దేశంలో అభివృద్ధి అయినా, ఇంతటి వైవిధ్యభరితమైన వారి వంగడాలను బహుళజాతి కంపెనీలు దళారీ ప్రభుత్వాల మద్దతుతో దొంగలించుకుపోయి సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికీ లోతట్టు ఆదివాసీ ప్రాంతల్లో వందల రకాల స్థానిక వరి వంగడాలు, తృణ ధాన్యాలు, దుంపలు, ఆకు కూరలు, కూరగాయలు, పండ్ల గింజలు,తదితరాలు ఇంకా ఆస్తిత్వంలో ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీల కబంధహస్తాల్లోకి వెల్లకుండా వాటిని కాపాడాల్సిన, సంరక్షించాల్సిన అవసరం వుంది.
సాధారణంగా కొండలు-గుట్టలు, అడవులు, ప్రత్యేకంగా ఎత్తయిన విశాలమైన పర్వత శ్రేణులు, విశాలమైన దట్టమైన అడవులు రుతు పవనాల కదలికలకు ఒక ముఖ్యమైన కారణంగా ఉంటాయి. ఉదాహరణకు, బస్తర్లోని రావాఘాట్ గుట్టలు ఋతుపవన వర్షాలకు అత్యంత అనుకూలమైనవి. ఈ గనుల తవ్వకాలతో ఋతువవనాలు తీవ్రంగా నకారాత్మకంగా ప్రభావితమయ్యి బస్తర్లోనే కాక దక్షిణ్ ఛత్తీస్గఢ్లోనే వర్షాలు తగ్గిపోతాయనీ, ఈ గుట్టలు దేశంలోనే పర్యావరణ సమతుల్యంలో అత్యంత ప్రాధాన్యత కలిగినవని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు. కాగా వీటిని ఎంత త్వరగా తవ్వి తరలించుకుపోదామా అని టాటా, అదానీ లాంటి దళారీ నిరంకుశ పెట్టుబడిదారులు తహతహలాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు అందుకు అన్ని రకాలుగా రంగం సిద్ధం చేస్తున్నాయి. పర్యావరణంలో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుండడంతో ఎక్కువ కాలం కొనసాగే విపరీతమైన ఎండలు, తద్వారా కరువులు, అకాల వర్షాలు తదితర ప్రకృతి వైపరీత్యాలు అనూహ్యంగా సంభవిస్తున్నాయి. ఇటీవలి ఒక అంచనా ప్రకారం గ్లోబల్ వార్మింగ్ కారణంగా త్వరలో సముద్ర జలాలు 27 సెం.మీ. ఎత్తు పెరగనున్నాయి.
అలాగే ఎలక్రానిక్ వస్తువుల పరిశ్రమలు పెరుగుతూ, ఉత్పత్తులు పెరగడంతో వాతావరణంలో రేడియేషన్ ఆమోదనీయమైన మోతాదు కంటే మించిపోతున్నది. దీని ద్వారా అనూహ్యమైన రోగాలు సంభవిస్తున్నాయి. మొత్తంగా ప్రజల ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితిని కూడా తమ లాభాల వేటకు వాడుకుంటూ ఆరోగ్యరంగాన్ని విస్తరిస్తూ బహుళజాతి కంపెనీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళ ద్వారా ప్రజలను విపరీతంగా దోచుకుంటున్నాయి. దోపిడీ ప్రభుత్వాల మద్ధతుతో వివిధ ప్రజారోగ్య పథకాల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాయి.
మా పార్టీ అడవులను, సకల జీవ వృక్ష జాతులతో కూడిన జీవవైవిధ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించే నిబద్ధతతో వుంది. మా పార్టీ నాయకత్వంలో పీఎల్డీఏ, ప్రజాసంఘాలు, ఆర్పీసీలు (విప్లవ ప్రజా ప్రభుత్వాలు) ప్రజలతో కలిసి ఇందుకోసం కృషి చేస్తున్నాయి. ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. మా ప్రజా ప్రభుత్వాల అటవీ రక్షణ విభాగం దీనిపై ప్రత్యేకించి కేంద్రీకరిస్తున్నది. ప్రజలను నిర్వాసితులను గావించే, పర్యావరణానికి, జీవవైవిధ్యానికి నష్టం కలిగించే ఏ ప్రభుత్వ, ప్రైవేటు పథకాన్నైనా మేము అడ్డుకుంటాం. ఇందుకోసం మాతో కలిసి పని చేయాల్సిందిగా దేశంలోనిg పర్యావరణవాదులకు, జీవ శాస్త్రవేత్తలకు, మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలకు, ప్రజాస్వామికవాదులకు, పౌరహక్కుల సంస్థలకు, సామాజిక సంస్థలకు, ఆదివాసీ సామాజిక సంఘాలకు పిలుపునిస్తున్నాం. చివరిగా మేము చెప్పేదేమంటే పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ కోసం ఒకవైపు దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాలను నిర్మిస్తూ వివిధ డిమాండ్లను సాధించే దిశలో పోరాటాలను నిర్వహించాలి. మరోవైపు దీర్ఘకాలిక ప్రజాయుద్ధ మార్గంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం ద్వారా ఏర్పడబోయే నూతన ప్రజాస్వామిక భారతదేశంలోనే అటవీ, పర్యావరణ, జీవవైవిధ్య పరిరక్షణ గ్యారంటీకి ప్రాతిపదిక ఏర్పడుతుంది.

3 ప్ర. అదే విధంగా, మీ పార్టీ, పీఎల్డీఏ క్రియాశీలంగా పనిచేసే అనేక ప్రాంతాలలో బొగ్గు, బాక్సైట్ వంటి సహజ వనరులు సమృద్ధంగా ఉన్నాయి. ఈ వనరులు భారీ బహుళజాతి పెట్టుబడిదారీ కార్పొరేషన్లకు కావాలి. ఈ వనరులను అప్పగించేందుకు ఫాసిస్టు భారత రాజ్యం ఆహ్వానిస్తున్నది. ఈ వనరులను ఈ కార్పొరేషన్లకు అప్పగించేందుకు అనేక మంది ప్రజలను తమ నివాస ప్రాంతాల నుంచి బలవంతంగా నిరాశ్రయులను చేస్తున్నది. భారతదేశంలో సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న విధానాల గురించి మీరు మరింత వివరంగా ఏమైనా చెప్పగలరా? ఈ సామ్రాజ్యవాదాన్ని సీపీఐ (మావోయిస్టు), పీఎల్డీఏ ఎలా ప్రతిఘటిస్తాయి?

కామ్రేడ్ బసవరాజు: మా దేశం పేద దేశం కాదు. కాని పేద ప్రజలున్న దేశమనేది నూటికి నూరు పాళ్ళు నిజం. మా దేశంలో హరితారణ్యాలున్నాయి. సంవత్సరం పొడవునా పారే జీవనదులున్నాయి. సారవంతమైన వ్యవసాయ భూములున్నాయి. అమూల్యమైన, అపారమైన ఖనిజ వనరులున్నాయి. వీటికి తోడు పదుల కోట్ల కష్టజీవులైన కార్మికులు, రైతులున్నారు. కోట్లాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, లక్షలాది మంది ఉన్నత విద్యావంతులు, మేధో శ్రమజీవులతో పాటు పదుల కోట్ల యువత వుంది. దేశ జన సంఖ్యలో 8.5 శాతంగా వున్న 700 లకు పైగా మూలవాసీ, ఆదివాసీ తెగల ప్రజలున్నారు. ఐనప్పటికీ మా దేశంలోని మెజారిటీ ప్రజలు ఆకలి, అవిద్య, అంధవిశ్వాసాలు, అనారోగ్యం, నిరుద్యోగం, దారిద్య్రం మొదలయిన సమస్యలతో అల్లాడుతున్నారు. మౌలిక జీవన సమస్యల పరిష్కారం కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం వివిధ రూపాలలో సంఘర్షిస్తున్నారు.
దీనికంతటికీ కారణం ప్రకృతి సంపదలు, వనరులు, అపార శ్రమశక్తి, స్థానిక టెక్నాలజీ దేశ ప్రజలందరి ప్రయోజనాల కోసం కాకుండా దేశంలోని అశేష ప్రజారాసుల చొరవ, శక్తిసమర్థతలను వెలికి తీయకుండా, వీరికి ప్రజాస్వామిక హక్కులు లేకుండా అణచిపెడుతూ పిడికెడు మంది దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల, భూస్వాముల, సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసమే ఇవన్నీ వినియోగించబడుతున్నాయి. మరింత నిర్దిష్టంగా చెప్పాలంటే భారతదేశంలో మూలవాసీ, ఆదివాసీ, గైరాదివాసీ ప్రజలు నివసించే అటవీ, అర్ధ అటవీ ప్రాంతాలలోనే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల మైదాన ప్రాంతాలలో ముఖ్యంగా మా పార్టీ నాయకత్వంలో విప్లవోద్యమం కొనసాగుతున్న అంటే పార్టీ, పీఎల్డీ జీఏ, ప్రజా సంఘాలు, కొన్ని ప్రాంతాలలో విప్లవ ప్రజా ప్రభుత్వాలు పనిచేస్తున్న పశ్చిమ్ బంగ్, ఒడిశా, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక (పశ్చిమ కనుమలు) రాష్ట్రాల్లోని అడవుల్లో అపారమైన ప్రకృతి సంపదలు, ఖనిజ వనరులు పుష్కలంగా వున్నాయి. ఇనుము, బొగ్గు, బాక్సైట్, అబ్రకం, మాంగనీస్, తగరం, వెండి, బంగారం, సున్నపురాయి, గ్రానైట్, అల్యూమినియం, రాగి, సిమెంట్ తదితర 90 రకాల ఖనిజాలను భారతదేశం ఉత్పత్తి చేస్తున్నది. వజ్రాల సేకరణ పెద్ద వ్యాపారంగా కొనసాగుతున్నది. ముఖ్యమైన ఖనిజాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోని 5 పెద్ద ఉత్పత్తిదారుల్లో ఒకటి.
భారతదేశ ఖనిజ వనరుల్లో 25% ఝార్ఖండ్లో వున్నాయి. దేశ బాక్సైట్ వనరుల్లో 70 శాతం, 28 శాతం ఇనుప ఖనిజపు వనరులు ఒడిశాలో వున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బొగ్గు, బాక్సైట్ గనులున్నాయి. ఛత్తీస్ గఢ్లోని బస్తర్, సర్గుజా ప్రాంతాలలో ఇనుము, తగరము, బంగారం, వజ్రాలు, బొగ్గు, యురేనియం, బాక్సైట్, కోరండం, డోలమైట్, క్యాసిటరైట్లు పుష్కలంగా వున్నాయి. మహారాష్ట్రలోని సూర్జాగఢ్ గుట్టల్లో 9 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం
వుంది. ఇలా దాదాపు అన్ని రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో లేదా మైదాన ప్రాంతాల్లో లేదా రెండు రకాల ప్రాంతాలలో అనేక ఖనిజ వనరులు పుష్కలంగా వున్నాయి.
అభివృద్ధి పేరుతో దోపిడీ పాలకవర్గాలు చేస్తున్నదంతా వారి తీవ్ర దోపిడీయే తప్ప ప్రజల అభివృద్ధి ఎంతమాత్రం కాదు. అది ప్రజల పాలిట వినాశకరమైన, వనరులను వారి లాభాల కోసం విచ్చలవిడిగా కొల్లగొట్టే, పర్యావరణాన్ని ధ్వంసం చేసే, దేశాన్ని తాకట్టు పెట్టే అభివృద్ధినిరోధక, దేశద్రోహకర నమూనాయే. ప్రకృతి సంపదలు, వనరులన్నింటినీ సమస్త ప్రజల కోసం, దేశం కోసం కాకుండా సామ్రాజ్యవాదుల, దళారీ దోపిడీ పాలకవర్గాల కోసం వినియోగించే నమూనాయే. అందుకే ఈ అభివృద్ధి నమూనాను వ్యతిరేకించాల్సిన, సమైక్యంగా పోరాడి తిప్పికొట్టాల్సిన అవసరం వుంది. వనరుల సంరక్షణ, సంవర్ధన, పర్యావరణ పరిరక్షణ, ప్రజలందరి అవసరాల కోసం, దేశ అవసరాల కోసం వాటిని విచక్షణాయుతంగా ఉపయోగించుకోవడం, భావితరాల కోసం వాటిని భద్రపర్చడమే అసలైన అభివృద్ధి నమూనా అవుతుంది.
సామ్రాజ్యవాదం, దళారీ దోపిడీ పాలకవర్గాల రాజ్యాధికారాన్ని కార్మికవర్గ పార్టీ నాయకత్వాన దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా ధ్వంసం చేసి దాని స్థానంలో నిర్మాణమయ్యే ప్రజల నూతన ప్రజాస్వామిక రాజ్యాధికారం మాత్రమే సరైన అభివృద్ధి నమూనాను అమలు చేస్తుంది. అప్పుడే ప్రజల నిజమైన సర్వతోముఖాభివృద్ధిని సాధించగలం. అప్పుడు మాత్రమే వనరుల విచ్చలవిడి దోపిడీని అరికట్టగల్గుతాం, సంరక్షించగల్గుతాం. ఈ ప్రయత్నాలు ప్రాథమిక స్థాయిలో మా పోరాట ప్రాంతాల్లో పార్టీ నాయకత్వంలో ప్రజా రాజ్యాధికార అంగాలైన ఆర్పీసీల ఆధ్వర్యంలో ప్రారంభమై కొనసాగుతున్నాయి.

4 ప్ర. లెస్బియన్లు, గేస్, బైసెక్సువల్స్, ట్రాన్స్ జెండర్లు (ఎల్జీబీటీ) వంటి విరుద్ధ లైంగికతలు గల (క్వీర్) సముదాయం పాత భారత రాజ్యం చేత పీడించబడుతున్నది. భారతదేశంలో ఎల్సీబీటీ హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమం పట్ల, భారత ఫాసిస్టు రాజ్యం చేత ఎల్జీబీటీ ప్రజలు పీడించబడడం పట్ల సీపీఐ (మావోయిస్టు) వైఖరి ఏమిటి?

కామ్రేడ్ బసవరాజు: అన్ని విషయాలను చూసినట్టే మా పార్టీ ఎల్జీబీటీ విషయాన్ని కూడా మార్క్సిస్టు (ఎంఎల్ఎం) దృక్పథంతోనే చూస్తుంది, విశ్లేషిస్తుంది. వర్గ పీడనను రూపుమాపడం ద్వారానే, ఎల్జీబీటీ సముదాయం పట్ల విశాల ప్రజల దృక్పథంలో మార్పు తీసుకురావడానికి నిరంతరాయ సైద్ధాంతిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, వైద్యపర కృషి సల్పడం ద్వారానే లింగ పీడన, వివక్షతల నుండి ఎల్జీబీటీ సముదాయానికి నిజమైన విముక్తి లభిస్తుంది. అప్పడే వారికి ఇతరులతో సమానంగా జీవించే పరిస్థితి ఏర్పడడంతో పాటు గౌరవ మర్యాదలు లభిస్తాయి.
పాత (రియాక్షనరీ) భారత రాజ్యం చేత దోపిడీ, పీడనలకు గురవుతున్న భారత దేశంలోని పీడిత వర్గాల, ప్రత్యేక సామాజిక సెక్షన్ల, పీడిత జాతుల ప్రజలందరి మానవ, పౌర హక్కులతో సహా అన్ని హక్కులను గుర్తిస్తున్నట్టే, హక్కుల కోసం జరుగుతున్న వారి పోరాటాలను బలపరుస్తున్నట్టే, అలాగే వారి పోరాటాలకు అండగా నిలుస్తున్నట్టే ఎల్జీబీటీ విషయంలోనూ మా పార్టీ వారి ప్రత్యేక సమస్యలను, వారి హక్కులను గుర్తిస్తుంది. వారి పట్ల సామాజిక వివక్షను వ్యతిరేకిస్తుంది. కొన్ని శారీరక ప్రత్యేకతలతోనూ, శారీరక, మానసిక ప్రత్యేక (జన్యు)లక్షణాలతోను పుట్టినప్పటికీ మొత్తం మానవాళిలో వారు ఒక భాగం. సామ్రాజ్యవాదులకు దళారులుగా వ్యవహరిస్తున్న పెట్టుబడిదారులకు, భూస్వాములకు ప్రాతినిధ్యం వహించే భారత రాజ్యం వారి పట్ల కొనసాగిస్తున్న పీడనను, వివక్షను వ్యతిరేకిస్తున్నది. భారత పౌరులుగా వారి జీవించే హక్కును, ఇతర పౌరులతో సమానంగా ప్రాథమిక హక్కులు, వారి నిర్దిష్ట సమస్యకు సంబంధించిన ప్రత్యేక/విశేష హక్కులతో సహా అన్ని హక్కులను పొందే, అనుభవించే హక్కును గౌరవిస్తున్నది.
విద్యా, వైద్యం, ఆవాసం, ఉద్యోగం, పాలన, రాజకీయ రంగాలన్నింటిలోనూ మేము స్థాపించబోయే భారత నూతన ప్రజాస్వామిక రాజ్యం వారికి భాగస్వామ్యం కల్పిస్తుంది. వారికి తగిన ఆర్థిక సామాజిక భద్రతను, ఆరోగ్యకరమైన సామాజిక సాంస్కృతిక వాతవరణాన్ని కల్పిస్తుంది. ఉచిత వైద్యాన్ని ఖాయం చేస్తూ, మంచి ఆరోగ్యాన్ని అందించగల ప్రజానుకూల వైద్య వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా స్వేచ్ఛాపూరితంగా వారికి అవసరమైన లేదా వారు కోరుకునే ఏదో ఒక గుర్తింపుతో జీవించడానికి అనుగుణంగా తమ లింగ నిర్ధారణ చేసుకొని అందుకవసరమైన మరియు అప్పటికీ అందుబాటులో వున్న శారీరక, మానసిక చికిత్సలు, ఉచిత వైద్యం ద్వారా ఆరోగ్యవంతమైన, గౌరవప్రదమైన, విజ్ఞానదాయకమైన జీవితాన్ని గడపడం కోసం అలాంటి వారందరికి అవకాశం కల్పిస్తుంది.
అలాగే సమాజం వారిపట్ల సమాన మరియు గౌరవభావంతో వ్యవహరించేలా అవసరమైన శిక్షణ అందిస్తుంది.
ప్రస్తుత దశలో వారి హక్కుల కోసం కొనసాగుతున్న ఉద్యమాలను సమర్థిస్తుంది. ఎల్జీబీటీ సముదాయం పై కొనసాగుతున్న లైంగిక హింస, దోపిడీ, పీడనలను, వివక్షను, లైంగిక అవకాశవాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఎల్డీబీటీ
సముదాయంలో భాగమయిన కారణంగా వారు ఏ అవకాశాలు కోల్పోరాదు. సమాజం కోసం తమ శక్తి సమర్థతలన్నింటిని వినియోగించేలా వారికి అవకాశాలు కల్పించాలి. ప్రస్తుత దశలో భారత దేశంలో ఎల్జీబీటీ హక్కుల కోసం సాగుతున్న ఉద్యమం ప్రధానంగా వర్గ పోరాట సామాజిక వాస్తవికత నుండి వేరుపడిపోయిన వ్యక్తి కేంద్రిత, బూర్జువా, ఆధునికానంతరవాద భావజాల ప్రభావంలో వుంది. దీని నుండి ఆ ఉద్యమం బయటపడాలి. ఎల్జీబీటీ సముదాయమే కాదు దేశంలోని పీడిత వర్గాలన్నింటిపై ఫాసిస్టు అణచివేతను, కూృరమైన దోపిడీని కొనసాగిస్తున్న భారత రాజ్యం అది ప్రాతినిథ్యం వహిస్తున్న అర్ధవలస-అర్ధభూస్వామ్య సామాజిక ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే పోరాటంలో అన్ని ఉద్యమాలు తప్పనిసరి భాగమవ్వాలి.
పీడిత ప్రజలందరితో పాటే ఎల్జీబీటీ సముదాయం కూడా సామ్రాజ్యవాదలు, భారత దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాల చేత దోపిడీ, పీడనలకు, అణచివేతకు, వివక్షకు గురవుతున్నందున ఈ ముగ్గురు శత్రువులకు వ్యతిరేకంగా పీడిత వర్గాలన్నింటితో అది ఐక్యమవ్వాలి.
సామ్రాజ్యవాదం, పాలకవర్గాలు, వారి భారత రాజ్యం దన్నుతో పోర్న్ ఇండస్ట్రీ (నీలి చిత్రాల పరిశ్రమ) ఎల్జీబీటీ సముదాయం పట్ల గల వివక్షను, వారి పేదరికాన్ని, నిరుద్యోగాన్ని సొమ్ము చేసుకోవడంలో భాగంగా, అలాగే ప్రజలలో, ప్రత్యేకించి యువజనులలో లైంగిక విశృంఖలత్వాన్ని, వికృతులను పెంచి పోషిస్తూ సమాజాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగా ఎల్జీబీటీ సముదాయాన్ని కూడా విచ్చలవిడిగా వాడుకుంటున్నాయి. మా పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. భారత నూతన ప్రజాస్వామిక రాజ్యం పోర్న్ ఇండస్ట్రీని నిషేధిస్తుంది.
ఎల్జీబీటీకి సంబంధించి ఒక్క విషయంలో మాత్రం-మహిళగానో, పురుషునిగానో లేదా వారు కోరుకున్న ఏ గుర్తింపు (థర్డ్ జెండర్)తోనైనా సాధారణ జీవితం గడుపుతూనే మరోవైపు అందుకు భిన్నంగా మరో రకమైన అసహజ సంబంధాన్ని, అరాచక బహుళ భాగస్వాములతో శారీరక సంబంధాలు కొనసాగించడాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తుంది, నిరుత్సాహపరుస్తుంది.
ప్రకృతి సహజంగా జరిగే జన్యు సంబంధమైన వైపరీత్యాల కారణంగా ఏర్పడే లింగ సంబంధమైన శారీరక ప్రత్యేకతల పట్ల సంబంధిత వ్యక్తులకు గానీ, ఇతరులకు గానీ సరైన, శాస్త్రీయ అవగాహన లేనప్పుడు ఇలాంటి విషయాల పట్ల, వ్యక్తులతో వ్యవహరించడం కూడా అసహజంగా, అనుమానాస్పదంగా, అగౌరవంగా, లజ్జాకరమైనదిగా వుండే అవకాశాలు మెండుగా వుంటాయి. అలాంటి పరిస్థితుల్లో సమాజం నుండే కాక కుటుంబాల నుండి, బంధువుల నుండి కూడా వివక్ష ఎదురవుతుంది. దాంతో అలాంటి వారు విడి సముదాయంగా జీవించే వైపు నెట్టబడుతారు. సోషలిస్టు రాజ్యం ఎల్జీబీటీ సముదాయం పట్ల సమాజంలో ప్రజలందరికీ శాస్త్రీయ అవగాహనను అందిస్తుంది. అలాంటి విషయాలను సహజంగా భావించే సాధారణ అవగాహనను పెంపొందిస్తుంది.
అలాగే పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం పెంచి పోషిస్తున్న వికృత సంస్కృతి సెక్స్ విశృంఖలత్వం బూతు సాహిత్యం, బూతు చిత్రాల ప్రభావం తదితరాల కారణంగానూ అసహజ శారీరక సంబంధాల వైపు ఒక సెక్షన్ ఆకర్షించబడుతున్నది. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం కూల్చివేత, కాలం చెల్లిన కుళ్లు సంస్కృతి ధ్వంసం, ప్రజాస్వామిక, సోషలిస్టు సంస్కృతి వ్యాప్తి ద్వారా సమాజంలో ఆరోగ్యకరమైన పరస్పర గౌరవప్రదమైన మానవ జీవన సంబంధాలను నెలకొల్పడానికి సోషలిస్టు రాజ్యం కృషి చేస్తుంది.

5 ప్ర. చివరిగా, భారతదేశంలో విప్లవ రాజకీయ ఖైదీల పరిస్థితి గురించి మిమ్మల్ని అడగాలను కుంటున్నాను. ఈ పరిస్థితి గురించి మన పాఠకులకు మరింత వివరంగా ఏమైనా చెబుతారా?

కామ్రేడ్ బసవరాజు: భారత దేశంలో గతంలో కొనసాగిన ప్రజా ఉద్యమాలను, నేడు కొనసాగుతున్న విప్లవోద్యమాన్ని, విస్థాపన వ్యతిరేక ఉద్యమాలను, కార్మిక, రైతాంగ ఉద్యమాలను, విద్యార్థి యువజనుల, ప్రభుత్వ ఉద్యోగుల, పీడిత సామాజిక సెక్షన్ల, మత్స్యకారుల, నిరుద్యోగుల, ఆదివాసీ, మత మైనారిటీ ప్రజల మానవ హక్కుల, మహిళల, వికలాంగుల, పెన్షన్దారుల, ఖైదీల ఉద్యమాలను అణచివేసేందుకు రాజ్యం అనుసరిస్తున్న పద్ధతులు, మార్గాలు బహుముఖమైనవి. ఇందులో రెండు ప్రధానమైనవి. ఒకటి సాయుధ బలగాలనుపయోగించి వివిధ పాశవిక, ఫాసిస్టు పద్ధతులలో పోరాడే ప్రజల నాయకత్వాన్ని, కార్యకర్తలను నిర్మూలించడం.
రెండోది అక్రమంగా నిర్బంధించి జైళ్ల పాలు చేయడం. కాలంచెల్లిన దోపిడీ పాలక వర్గాల అధికారాన్ని సుస్థిరంగా ఉంచడంలో, కాపాడడంలో, వారి దోపిడీ, పీడనలను, ప్రజా వ్యతిరేక విధానాలను నిరాటంకంగా కొనసాగించడంలో రాజ్య యంత్రాంగంలో సాయుధ బలగాలు, కోర్టులు, జైళ్లు, వీటికి పునాదిగా వుండే రాజ్యాంగం ప్రధానమైనవి, కీలకమైనవి. రాజ్యాన్ని ఎదిరించే వారిని సాయుధ బలగాల ద్వారా నిర్మూలించడం, అరెస్టులు చేసి జైళ్లలో నిర్బంధించడం, కోర్టుల ద్వారా శిక్షలు విధించడం, వారిని ప్రజా జీవితం నుండి వేరు చేసి, వాళ్ళ శక్తి సమర్థతలను నాశనం కావించడం వర్గ సమాజంలో సర్వసాధారణం.
భారతదేశంలో విప్లవ రాజకీయ ఖైదీల పరిస్థితి దినదినం దుర్భరంగా మారుతున్నది. భారత రాజ్యం గతం నుండి, ప్రత్యేకించి బ్రాహ్మణవాద హిందుత్వ ఫాసిస్టు భారతీయ జనతా పార్టీ పాలన మొదలయినప్పటి నుండి అన్ని ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల, ఉద్యమ సంస్థల పట్లనే కాకుండా విప్లవ రాజకీయ ఖైదీల పట్ల అత్యంత అమానవీయంగా, మరింత పాశవికంగా వ్యవహరిస్తున్నది. ఒక్క విప్లవ రాజకీయ ఖైదీల పట్లనే కాదు, మతమైనారిటీల, దళితుల ఉద్యమాల కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలు, విప్లవ, ప్రగతిశీల, ప్రజాస్వామిక, లౌకిక వాదులైన విద్యార్థి-యువజనులు, ఉపాధ్యాయులు, దేశభక్తులు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, వకీళ్ళు, విలేకరులు, శాస్త్రవేత్తలు, వివిధ సామాజిక కార్యకర్తలు, కార్మిక రైతు సంఘాల
కార్యకర్తలు, విస్థాపన వ్యతిరేక ఉద్యమాల కార్యకర్తలు, కశ్మీర్, నాగా, మణిపుర్, అసోం, బోడో, తదితర జాతుల ఉద్యమాల కార్యకర్తల పట్ల రాజ్యం శతృపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నది. ఒక్కరేమిటీ అభివృద్ధినిరోధక దోపిడీ పాలక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక, దేశ ద్రోహకర విధానాలను ప్రశ్నించే ప్రతి గొంతును శాశ్వతంగా నొక్కివేయడానికి, అలా సాధ్యం కానప్పుడు ఆ గొంతులను కటకటాల వెనుక బంధించి వుంచడానికి రాజ్యం అనేక అక్రమ పద్ధతులను అనుసరిస్తున్నది.
తనే రాసుకున్న రాజ్యాంగాన్ని ఘోరంగా ఉల్లంఘిస్తున్నది, ఫాసిస్టీకరిస్తున్నది, కాషాయీకరిస్తున్నది. తప్పుడు కేసులు, కుట్ర కేసులు బనాయించి విచ్చలవిడిగా అరెస్టులు సాగిస్తున్నది. తమను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలనే హక్కును పశ్చిమ బెంగాల్, కేరళ జైళ్లలో మావోయిస్టు ఖైదీలు పోరాడి సాధించుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలకు ఆ గుర్తింపునీయకపోవడం భారత దళారీ పాలకవర్గం అణచివేత విధానాల ఫలితమే.
ప్రశ్నించే గొంతులను కటకటాల వెనుక బంధించడం, పాలకవర్గాలను ప్రశ్నించే, ఎదురించే వాళ్ళందరినీ జైళ్లలో
నిర్బంధించడం పాత భారత రాజ్యానికి కొత్తేమి కాదు. అది బ్రిటీషు రాజ్యం నుండి ఈ వారసత్వాన్ని పునికిపుచ్చుకుంది. భారత రాజ్యానికి సామాజిక, ఆర్థిక, రాజకీయపరంగానే కాక రాజ్యాంగపరంగా కూడా ఉన్నత కుల, వర్గ, లింగ (పురుషాధిక్య) పక్షపాతం వుంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నింటిలోనూ కొనసాగుతున్నది. ఇది రాజకీయ ఖైదీల పట్ల కూడా అమలు చేయబడుతుంది.IMG-20250522-WA0178

Tags: