కార్పొరేట్ కు ధీటుగా గాయత్రి బ్యాంకింగ్ సేవలు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం. మల్యాలలో గాయత్రి బ్యాంక్ శాఖ ప్రారంభం.
కార్పొరేట్ కు ధీటుగా గాయత్రి బ్యాంకింగ్ సేవలు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం.
మల్యాలలో గాయత్రి బ్యాంక్ శాఖ ప్రారంభం.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మే 18: కార్పొరేట్ కు ధీటుగా గాయత్రి బ్యాంకు సేవలను అందిస్తూందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం అన్నారు. ఆదివారం మల్యాల మండల కేంద్రంలో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క 64వ శాఖను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల కేంద్రంగా పనిచేస్తున్న గాయత్రి బ్యాంకు మల్టిస్టేట్ బ్యాంకుగా రెండు తెలుగు రాష్ట్రాలలో 63 బ్రాంచీలతో 805324 మంది వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలందిస్తూ, మన చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాలలో 64వ బ్రాంచిని ప్రారంబించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల బ్యాంకుగా గుర్తింపు పోంది సహకార రంగంలో స్ఫూర్తిదాయకమైన బ్యాంకుగా పనిచేస్తుందని రూ.3219.44 కోట్ల వ్యాపారాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానానికి చేరుకోవడం పట్ల బ్యాకు యాజమాన్యాన్ని అభినందించారు. మల్యాల మండల ప్రజల ఆర్ధిక ఉన్నతికి బ్యాంకు సహకరించాలని వినియోగదారులు బ్యాంకును తప్పక ఆదరించాలని కోరారు. అనంతరం బ్యాంకు అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా బ్యాంకును అదరిస్తూ బ్యాంకు యోక్క ఉన్నతిలో భాగమైన 8లక్షల 5వేల మంది వినియోగదారులకు కృతజ్ఞతలు తెలియజేసారు. రూ. 1854.75 కోట్ల డిపాజిట్లతో, రూ.1364.69 కోట్ల రుణ విలువ రలిగి 0 శాతం ఎన్.పి.ఎ కలిగి ఉన్నామని ఈ అర్ధిక సంవత్సరంలో మరో 17 బ్రాంచిలను తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించనున్నామని దాంతో మోత్తం 81 బ్రాంచీలకు చేరుకోనున్నామని తెలియజేశారు.
అనంతరం జిల్లా సహకార అధికారి సి. హెచ్ మనోజ్ కుమర్ మాట్లాడుతూ సహకార రంగానికి గాయత్రి బ్యాంకు అదర్శప్రాయయని, బ్యాంకు పనితిరుతో సేవా దృక్పదంతో వినియోగదారులకు మన్ననలు పోందుతూ వారి ఆర్ధిక వృద్ధికి చేయుతనిస్తుందని, గాయత్రి బ్యాంకు మన ప్రాంతంలో ప్రారంబించడం ఈ ప్రాంతానికి గర్వకారణమని, మల్యాల బ్రాంచిని ప్రజలు ఉపయోగించుకొని ఆర్ధిక క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలన్నారు.అనంతరం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ కేవలం 550 రూపాయలకే సేవింగ్ ఖాతాను ప్రారంభిస్తారని, రైతులు, మహిళలు అందరూ కూడా సేవింగ్ ఖాతాలను ప్రారంభించి ఆర్ధిక లావాదేవీలను యుపిఐ (ఫోన్పే, గూగుల్ పే) ద్వారా నిర్వహించడం చాలా సులువుగా ఉంటుందని, గాయత్రి బ్యాంకు మల్యాల శాఖను ఆదరించాలని కోరారు అనంతరం మల్యాల మాజీ ఎంపిపి మిట్టపెల్లి విమల సుదర్శన్ మాట్లాడుతూ బ్యాంకులో ఎటువంటి హిడెన్ చార్జీలు లేకుండా పేద మధ్య తరగతి వినియోగదారుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నారని అన్ని రకాల రుణాలను అందిస్తున్నారని సత్వర సేవలకు మారుపేరుగా ఉందన్నారు. అనంతరం ముఖ్యకార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ మాట్లాడుతూ గాయిత్రి బ్యాండునకు జగిత్యాల జిల్లాలో 09 బ్రాంచీలు ఉండగా మల్యాలలో నూతనంగా మరో బ్రాంచీని ప్రారంభిస్తున్నామని వినియోగదారుల చెంతకు బ్యాంకు సేవలు తీసుకురావడం బ్యాంకు లక్ష్యమని, ఎటువంటి హిడెన్ చార్జీలు లేకుండా పేద మధ్య తరగతి వినియోగదారుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నామన్నారు. వినియోగదారులు మాపై చూపిస్తున్న ఏనలేని ఆదరాభిమానాల వల్ల బ్యాంకును మరింత అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని, మల్యాల నగరవాసులు మరియు పరిసర గ్రామాల ప్రజలు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకొని బ్యాంకును ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బ్రాంచి హెడ్ ఎంఏ.రహీం మాట్లాడుతూ ఆధార్ నంబరు ద్వారా నగదు బదిలీ పథకం క్రింద వచ్చు సబ్సిడీ బదలాయింపులను, ప్రభుత్వ పెన్షన్లను పొందవచ్చని, బంగారు ఆభరణాలపై ఋణాలను అందజేస్తామని, రైతులకు, వ్యాపారులకు ఆస్థి తనఖాపై ఋణ సౌకర్యం కల్పిస్తామని, సేవింగ్, కరెంటు ఖాతాలను వెంటనే ప్రారంభిస్తామని వినియోగదారులు బ్యాంకును ఆదరించి ప్రోత్సహించాలని కోరారు. ఋణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు లేవని, డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తున్నామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు ఇమ్మడి శ్రీలత, జె. రామ సత్యనారాయణ, బి. రవిందర్, డిప్యూటి జనరల్ మేనేజర్ సి.హెచ్. క్రిష్ణారెడ్డి, రిజనల్ మేనేజర్లు బింగి తిరుపతి, బి.ప్రవీణ్ కుమర్, సి.హెచ్. వంశీకృష్ణ సహకార అధికారులు, బ్యాంకు పాలక వర్గ సభ్యులైన ముత్యాల లక్ష్మణ్ రెడ్డి, ఎమ్. సౌజన్య, ఎ.రాజిరెడ్డి, ఎ. సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, జి.గంగాధర్, వి. మాధవి, ఆర్. సతీష్, ఎస్. రవి కుమార్, ఇతర సభ్యులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.