ఇసుక అక్రమ రవాణాదారుల ముందస్తు బైండ్ ఓవర్ సీఐ నిరంజన్ రెడ్డి

ఇసుక అక్రమ రవాణాదారుల ముందస్తు బైండ్ ఓవర్ సీఐ నిరంజన్ రెడ్డి

*ఇసుక అక్రమ రవాణా దారుల ముందస్తు బైండ్ ఓవర్ 

*ఏ. నిరంజన్ రెడ్డి, కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ 

చురకలు ప్రతి నిధి
కరీంనగర్, మే, 15

            గురువారం రోజున  శుభం నగరలే, అసిస్టెంట్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, కరీంనగర్ రూరల్  ఆదేశాలతో,  ఏ. నిరంజన్ రెడ్డి, కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నగునూర్,  వల్లంపహాడ్, బొమ్మకల్, కరీంనగర్ తదితర ఏరియా లోని ఇసుక అక్రమ రవాణా దారులతో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి ఉన్న రీచ్, క్వారీల నుండి ఇళ్ళు,ఇతరత్రా నిర్మాణాలకు ఇసుక ను కొనుగోలు చేయాలని సూచించారు. మానేరు పరివాహక ప్రాంతాల నుండి అక్రమంగా తరలించ బడుతున్న ఇసుకను కొనుగోలు చేయవద్దని చెప్పారు. 

              ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని గ్రామస్థులతో పాటు పాటుగా గతంలో కేసులు నమోదైన యజమానులు, పాల్గొన్నారు. ఆ తరువాత గతంలో ట్రాక్ట ర్స్ లలో ఇసుక  అక్రమ రవాణా చేసి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన  వల్లంపహాడ్, నగునూర్, బొమ్మకల్ గ్రామం  యు దుర్శేడ్ గ్రామస్తులు తొమ్మిది మందిని కరీంనగర్ రూరల్ మండల్ తహసీల్దార్  హాజరు పరిచి ఇక ముందు ఎలాంటి అక్రమ రవాణా చేపట్టకుండా ముందస్తుగా లక్ష రూపాయల పూచికత్తు పై బైండ్ ఓవర్ చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.IMG-20250515-WA0088

Tags: