ప్రజాజీవితాన్ని ఓ పోరాటంగా భావిస్తా మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రజాజీవితాన్ని ఓ పోరాటంగా భావిస్తా మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రజాజీవితాన్ని ఓ పోరాటంగా భావిస్తా.

పార్టీకి విధేయున్ని కాబట్టే 14 సార్లు బిఫామ్ అందుకున్నా.

పదేళ్లు అధికారంలో ఉండి జగిత్యాలకు సంజయ్ చేసిందేమిటి.

మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి

చురకలు ప్రతినిధి, జగిత్యాల, మే 21: నా ప్రజాజీవితాన్ని ఓ పోరాటంగా భావిస్తానని, పార్టీకి విధేయున్ని కాబట్టి 14 సార్లు బిఫామ్ అందుకున్నానని, పదేళ్లు అధికారంలో ఉండి
జగిత్యాలకు ఎమ్మెల్యే సంజయ్ చేసిందేమిటని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితం నల్లేరుపై నడక లాంటిది కాదని, తాను సంజయ్ కుమార్ అంత అదృష్టవంతున్ని కాదని, పోరాట స్ఫూర్తితో గెలుపు, ఓటములతో
సంబంధం లేకుండా ప్రజాజీవితంలో కొనసాగుతున్నానన్నారు. ఇటీవలే తాను బిసి రిజర్వేషన్లపై మాట్లాడటానికి గాంధీభవన్లో ప్రెస్మీట్ ఏర్పాటు చేస్తే అక్కడ కొందరు విలేకరులు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్కుమారి ఏ పార్టీ అని అడగడంతో తాను స్పీకలను ఈ విషయాన్ని అడగాలని వ్యాఖ్యనిస్తే జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ తాను అసహనం, ఆవేశంతో మాట్లాడుతున్నానని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఉన్నదని ఉన్నట్లు మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని, గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ఏం చేశాడని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదేపదే 4520 డబుల్ బెడ్రూం ఇండ్ల గురించి మాట్లాడుతున్నారని,
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైద్రాబాద్ తర్వాత జగిత్యాలలో ఇండ్ల నిర్మాణానికి స్థల సేకరణ చేసి 4 వేల ఇండ్లను మంజూరు చేయించానని గుర్తు చేశారు. 2014లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాటి ఎంపి కవిత జగిత్యాల తమ ఎమ్మెల్యే సంజయ్ అని సంబోధించారని, 2018లో డా.సంజయ్ ్ను నాటి ఎంపి కవిత కాలుకు బలపం కట్టుకొని గ్రామగ్రామాన తిరిగి గెలిపించారన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నాయకత్వంలో తాను కాంగ్రెస్లో చేరి 40 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నానని చెప్పడం తనకు గర్వంగా ఉందన్నారు. 2014లో ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఒకరు బిఆర్ఎస్లో చేరగా, తాను ఒక్కడినే ప్రతిపక్షసభ్యునిగా నిత్యం ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తానన్నారు. తాను అత్యధిక సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా బిఫామ్ పొందడం కాంగ్రెస్ పార్టీతో తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందన్నారు.
2019లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన అనంతరం బిఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పోకడలపై తాను శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించానన్నారు. బిసిలకు రాజ్యాంగ బద్దంగా
దక్కాల్సిన అధికారం ఉన్నత వర్గాలకు కట్టబెట్టింది ఎవరని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జగిత్యాల మున్సిపల్ చైర్మన్, మండల ప్రజాపరిషత్ అధ్యక్ష స్థానాలను బిసిలకు కట్టబెట్టామన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలో చేరి జగిత్యాల అభివృద్ధికి పార్టీలో చేరానంటే ఏలా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు బండ శంకర్, కొత్త మోహన్, గాజెంగి నందయ్య, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, జున్ను రాజేందర్, మన్సూర్, నేహల్, నక్క జీవన్, భీరం రాజేష్, గుండ మధు లైశెట్టి విజయ్, బండారి మధు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20250521-WA0086

Tags: