ఎన్ కౌంటర్ లో మావో అగ్రనాయకుడు కేశవ్ రావు మృతి
By: Mohammad Imran
On
ఎన్ కౌంటర్ లో కేశవ్ రావు మృతి
చురకలు ప్రతి నిధి
హైదరాబాద్, మే, 21
మావోయిస్ట్ అగ్ర నాయకుడు నంబాల కేశవ్ రావు అలియాస్ బస్వరాజు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్)కి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా పరిగణించబడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని జియన్నపేట గ్రామానికి చెందిన కేశవరావు, వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ప్రస్తుతం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్) నుండి బీటెక్ పట్టా పొందారు. 2018లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా చేసిన తర్వాత అతను సీపీఐ (మావోయిస్ట్)కి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
ఛత్తీస్‌గఢ్లోని నారాయణ్‌పూర్ లో జరిగిన ఆపరేషన్‌లో నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజుతో సహా 27 మంది మావోయిస్టులు భద్రతా దళాల చేతిలో హతమయ్యారు.
Tags: