ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం.
ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశాం.
ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, జూన్ 27: వినియోగదారులకు ప్రత్యామ్నాయ లైన్ (ఇంటర్ లింకు లైన్) ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థ ను ఏర్పాటు చేశామని జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం తెలిపారు. శుక్రవారం ఎస్ఈ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 118 33/11కెవి సబ్ స్టేషన్ లో 23 33కెవి లైన్లలో ఇంటర్ లింకింగ్ వ్యవస్థను చేపట్టడం జరిగిందని,(12) 33/11కెవి సబ్ స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయని , తగిన కార్యాచరణ ప్రణాళికాతో ముందుకు వెళ్తున్నామన్నారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందిస్తున్నామని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో గాని, మెయింటెనెన్స్ సమయంలో గాని, ఇతర కారణాల చేత గాని ఒక లైన్ లో లేదా సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన, నిలుపవలసిన సమయంలో ఆయా లైను లేదా సబ్ స్టేషన్ పరిధిలోగల విద్యుత్ 33కేవీ ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థ అనేది ఒక 33/11కేవీ సబ్ స్టేషన్ నుండి మరొక 33/11కేవీ సబ్ స్టేషన్ కు, అలాగే ఒక 33/11కేవీ సబ్ స్టేషన్ నుండి మరొక 132/33కేవీ సబ్ స్టేషన్ కు, ఇదే విధంగా 33కేవీ లైన్ నుండి మరొక 33కేవీ లైన్ కు మధ్య అనుసంధానంగా ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందచేయడం సులువుగా ఉంటుందన్నారు. దీనివలన విద్యుత్ వినియోగదారులకు అంతరాయాలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయుటకు వీలు కలుగుతుందన్నారు. తదననుగుణంగా 11కెవి ఇంటర్ లింకింగ్ లైన్ల వ్యవస్థ పై కూడా దృష్టి సారించామని, అవసరమైన లైన్ల ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేపట్టామని తెలిపారు.
వినియోగదారులకు మెరుగైన , నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించే దిశగా కృషి చేస్తున్నామని వివరించారు.