భారీ వర్ష సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ అశోక్ కుమార్
భారీ వర్ష సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
*కూలీ పోయే ఇండ్లలో ఉండొద్దు...!!*
*చెరువులు, వాగుల వద్దకు వెళ్లొద్దు...!!*
*విద్యుత్ స్తంభాలతో జాగ్రత్త వహించాలి...!!*
చురకలు ప్రతి నిధి
జగిత్యాల, జులై, 23
ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మరియు మండల పరిధిలోని ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉంటు సేవలు అందించాలని సూచించారు. భారీ వర్షాలు దృష్ట ఎలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ వర్షాల దృష్ట కడెం ప్రాజెక్టు నుండి గోదావరి నదిలోకి నీళ్లు వదిలి అవకాశం ఉన్నందున గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నది పరివాహక ప్రాంతాల్లో కాలువలు చెరువుల ప్రాంతాల్లో పశువులను మేపడానికి ఎవరు వెళ్ళవద్దని సూచించారు.జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కూలీ పోయే ప్రమాదంలో ఉన్న ఇండ్లలో నివసించే ప్రజలు సురక్షిత నివాసాలకు తరలివెళ్లాలని అన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఉండే ఇండ్లలోకి వర్షపునీరు చేరకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
*భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పలు సూచనలు చేశారు*
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
.
ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు,కాలువలు,నదులు, రిజర్వాయర్లు,చెరువుల వద్దకు వెళ్ళ వద్దని,
చెట్ల కింద,పాడైన భవనాలు కింద,శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండ వద్దు విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదని,
ఎవ్వరు కూడా ఎట్టిపరిస్థితుల్లో కూడా చెరువులోకి,నాలాలు , వాటర్ ఫాల్స్ లేదా చేపల వేటకు గాని వెళ్ళరాదు. అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలని ఎస్పీ సూచించారు.
వరద నీటికి చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉంటుంది. కావున ప్రజలు అప్రమత్తం గా ఉండగలరని ఎస్పీ పేర్కొన్నారు.
*వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి. వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి , గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని, కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించాలని ఎస్పీ సూచించారు.*
*వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదు అని సూచించారు.*
*గోదావరి నది పరివాహ గ్రామ ప్రజలు, పిల్లలు, యువకులు నది దగ్గరకు సెల్ఫీలు తీయడానికి ఈతలు కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు.*
*ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 నెంబర్ కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.*
ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ప్రజలు పోలీసు వారి సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు.*