రైతుల సమస్యలు పరిష్కారానికే పొలం బాట

రైతుల సమస్యల పరిష్కారానికే పొలంబాట.


చురకలు ప్రతినిధి, జగిత్యాల జూన్ 27: రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారుల పొలంబాట కార్యక్రమాన్ని చేపడుతున్నామని, వంగిన పోల్ లను , లూజ్ లైన్ లను సరిచేస్తున్నామని, మధ్య స్తంభాలను ఏర్పాటు చేస్తున్నామని  డివిజినల్  ఇంజనీర్ టెక్నికల్ కె.గంగారం అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తీగల మధ్య అవసరం ఉన్న చోట స్పేసర్స్ పెడుతున్నామని,  ఇప్పటివరకు పొలంబాట కార్యక్రమం ద్వారా వంగిన పోల్  లు 327,  లూజ్  లైన్లు   570 ,  తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు 64,  మార్చినామని తెలిపారు. రైతులకు మరింత మెరుగైన , నాణ్యమైన నిరంతర  విద్యుత్ సరఫరా అందిస్తున్నామని, వారి సమస్యల పరిష్కార ద్యేయంగా  పొలంబాట కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందన్నారు .  రైతులకు విద్యుత్ ప్రమాదల పట్ల అవగహన కల్పిస్తున్నామని అన్నారు. విద్యుత్  పట్ల  జాగ్రత్తగా ఉండాలని  ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం, వ్యవసాయ పంపు సెట్లను వినియోగించినప్పుడు కరెంటు మోటార్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్  విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కావున, కరెంటు మోటార్లను కాని, పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమరపాటుతో తాకకూడదన్నారు. వ్యవసాయ పంపుసెట్లను మరియు స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయాలని, విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయని తెలిపారు.  దీనితో పాటుగా  విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు  లేకుండా మెరుగైన సరఫరా అందించడానికి  వ్యవసాయ పంపుసెట్లకు  కెపాసిటర్లు  ఎంతగానో ఉపయోగపడుతున్నాయని  అన్నారు. కెపాసిటర్లు  పెట్టుకోవడం వలన  మోటార్ల జీవిత కాలం పెరుగుతుందని, లో వోల్టేజి సమస్య ఉండదన్నారు. కెపాసిటర్లు అమర్చడం వలన  రీయాక్టివ్  పవర్ కాంపన్సేషన్ ద్వారా  పవర్ ఫాక్టర్ మెరుగు పడి   ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ భారం తగ్గి  మోటార్లు కాలిపోకుండా మన్నిక  పెరుగుతుందని తెలిపారు. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయితే  వ్యవసాయదారులు  వెంటనే 1912 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఆ ఫిర్యాదు సమాచారం వెంటనే వెబ్ అప్లికేషన్ ద్వారా  సంబంధిత అధికారి మొబైల్ యాప్ కు వెళ్తుందన్నారు. సదరు అధికారి ఆ ట్రాన్స్ఫార్మర్ ను చెక్ చేసి ఫెయిల్ అయ్యిందని నిర్దారించుకొని  వెంటనే ఫెయిల్ అయ్యిందని యాప్  లో నమోదుచేస్తే  సంబంధిత ఎస్పీఎం షెడ్ అధికారికి  ఆ సమాచారం వెళ్తుంది.  ఆ తర్వాత ఎస్పీఎం  షెడ్  అధికారి  వెంటనే మరొక ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసి ఆ అధికారికి  ట్రాన్స్ఫార్మర్ ను తీసుకు వెళ్ళవలసిందిగా సమాచారం యాప్ లో నమోదు చేయడం తో ఆ సమాచారం వెళ్తుందన్నారు.  ఆ  ట్రాన్స్ఫార్మర్ ను ఫెయిల్ అయిన చోట ఏర్పాటు చేయడం తో ఫిర్యాదు చేసిన రైతుకు ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని మెసేజ్ వెళ్తుందని, ఇలా త్వరిత గతిన ట్రాన్స్ఫార్మర్  లను  మార్చడం వలన రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ  ప్రక్రియలో ఒక వేళ  48 గంటలు దాటి ఆలస్యం  జరుగుతుందని గుర్తిస్తే పై అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని యుద్దప్రాతిపదికన ఏర్పాట్లు జరిగేటట్లు చేస్తారని అన్నారు . 
రైతులందరూ తప్పకుండ 1912 కి ఫోన్ చేసి తమ సమస్యను తెలపాలని కోరుతున్నారు. రైతులు, వినియోగదారులు స్వయంగా విద్యుత్ శాఖకు తెలపకుండా స్వయంగా  కరెంట్ పనులను    చేసుకొని నిండు ప్రాణాలు కోల్పుతున్నారని, కాబట్టి 24/7 అందుబాటులో ఉండే విద్యుత్ శాఖ సిబ్బంది ని సంప్రదించి పనులను చేసుకోవాలని కోరుతున్నారు .

Tags: