నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఎస్ ఇ. సుదర్శనం
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ఎస్ ఈ సుదర్శనం
జగిత్యాల :
విద్యుత్ శాఖ సిబ్బంది ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఎస్ ఈ సుదర్శనం అన్నారు. ఈరోజు జగిత్యాల టౌన్, రూరల్ మరియు ధర్మపురి సబ్ డివిజన్ల విద్యుత్ సిబ్బందితో జగిత్యాల లోని వి కె బి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమీక్ష
సమావేశంలో జగిత్యాల జిల్లా సూపరింటెండ్ ఇంజనీర్ బి. సుదర్శనం పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగిత్యాల టౌన్, రూరల్ మరియు ధర్మపురి సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ సిబ్బందితో విద్యుత్ ప్రమాదాల నివారణ విద్యుత్ భద్రత ప్రమాణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగిని ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు గూర్చి వారిచే సమాధానాలు అడిగి సమీక్షించారు , అందరు సిబ్బందితో ప్రమాద నివారణ పై ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో ఎటువంటి విద్యుత్ ప్రమాదాల జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్లక్షం వహించితే కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు. విద్యుత్ సిబ్బంది ఫీల్డ్ లో పనిచేసేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుంటే 3000 రూపాయలు పెనాల్టీ వేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఈసమావేశంలో డి.ఈ టెక్నికల్ సేఫ్టీ ఆఫీసర్ గంగారాం , జగిత్యాల డి ఈ రాజిరెడ్డి, ఏ.డీ.ఈలు ,ఏ.ఈ లు , ఏ ఏ ఓ లు,సబ్ ఇంజనీర్లు మరియు ఓ&ఏం ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.