విధులకు ఆటంకం కల్గించిన వ్యక్తి పై కేసు నమోదు
విధులకు ఆటంకం కల్గించిన వ్యక్తి పై కేసు నమోదు..
చురకలు ప్రతినిధి, జగిత్యాల జులై 29: జగిత్యాల జిల్లా రవాణా శాఖలో సీనియర్ అసిస్టెంట్ నక్క సంపూర్ణ విధులకు ఆటంకం కల్గించి, కులం పేరుతో దూషించిన జగిత్యాల రూరల్ మండలం పొలాసకు చెందిన విశ్వ తెలంగాణ ఆన్లైన్ పత్రికా రిపోర్టర్ కుర్మ రమేష్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయినట్లు జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపారు. కుర్మ రమేష్ అతనికి తెలిసిన వారికి మోటర్ డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ ఇప్పించే విషయంలో ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా డ్రైవింగ్ స్కూల్ లైసెన్సు ఇవ్వాలని, భయభ్రాంతులకు గురిచేస్తూ మరియు నెలకు లక్ష రూపాయలు తనకు ఇవ్వాలని, లేనిచో తప్పుడు వార్తలు రాస్తూ, మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తానని బెదిరింపులకు గురి చేశాడు. జిల్లా రవాణా శాఖ అధికారి, సీనియర్ అసిస్టెంట్ నక్క సంపూర్ణ విధులకు ఆటంకం కలిగించి, భయబ్రాంతులకు గురి చేస్తూ కులం పేరుతో దూషించినందుకు కుర్మ రమేష్ పై జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. తదుపరి విచారణ చేపట్టి దర్యాప్తు నిమిత్తంలో భాగంగా మంగళవారం జగిత్యాల డిఎస్పి డి.రఘుచందర్ తాటిపల్లిలోని ఆర్టీవో ఆఫీసును సందర్శించి విచారణ చేపట్టారు.