జర్నలిస్ట్లను విమర్శిండం ముఖ్యమంత్రికి తగదు
జర్నలిస్టులను విమర్శించడం ముఖ్యమంత్రికి తగదు..
అ ఆ లు ఏబీసీడీలు రానోల్లు ముఖ్యమంత్రులు, మంత్రులు కాలేదా?
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్..
పెగడపెల్లి: కొందరు జర్నలిస్టులు పని పాట లేక రోడ్ల మీద తిరిగే చిల్లర వెదవలని వాళ్ళను చూస్తే దిగి పల్ల పల్ల కొట్టాలనిపిస్తాదని అ ఆ లు ఏబీసీడీలు రానివారు కూడా జర్నలిస్టు ముసుగులో చలామణి అవుతున్నారని జర్నలిస్టులను వాడు వీడు అంటూ ఏకవచనంతో సంబోధించడం ముఖ్యమంత్రికి తగదని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా ఆరు గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక 100 రోజులు అని ఏడాదిన్నర గడిచిన హామీల అమలు ఏదని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి జీర్ణించుకోలేక జర్నలిస్టుల మీద అక్కసు వెళ్లగక్కడం సరైన పద్ధతి కాదని అన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక సాయుధ పోరాటంతోనే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన సీతక్క మంత్రి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిషేధం విధించిన గద్దర్ పేరిట అవార్డులు ప్రకటించవచ్చు అ ఆ లు ఏబీసీడీలు రాని టంగుటూరి అంజయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయమని ప్రశ్నించే పత్రికల మీద యూ ట్యూబ్ ఛానెళ్ల మీద అక్కసు వెళ్లగక్కడం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల సమస్యలను వెలికితీసే ప్రతి ఒక్కరు జర్నలిస్టులేనని అన్నారు. ప్రజల హక్కులు కాలరాయబడుతున్నపుడు ప్రశ్నించే ప్రతిఒక్కరు జర్నలిస్టేనని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చడానికి ప్రజల సమస్యలను ప్రతిపక్షాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రతివాడు జర్నలిస్టు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని అన్నారు. నైతిక విలువలతో నిజమైన వార్తలను ప్రసారం చేసే సామాజిక మాధ్యమాలు నేటి సమాజంలో ఎంతో అవసరమని అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాసి వార్తలు రాయడం మానుకోవాలని ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు.చట్టసభల్లో చట్టాలు చేసేవారికే విద్యార్హతలు అవసరం లేనప్పుడు పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సమాజాన్ని ప్రభావితం చేసి ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఉండేవారు ప్రతి ఒక్కరు జర్నలిస్టుల లాంటి వారేనని అన్నారు.ఈసమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి,మాజీ అధ్యక్షుడు గంగుల కొమురెల్లి, ప్రధాన కార్యదర్శులు కొత్తూరి బాబు, తోడేటి గట్టయ్య, కోట మల్లేశం మండల నాయకులు బోగ లతీష్,అంకం అనిల్ తదితరులు పాల్గొన్నారు..