పదవి విరమణ బాధ్యతలనుండి తప్పించి బందాలను బలపరుస్తుంది అడిషనల్ ఎస్పీ గౌస్ బాబా
*పదవీ విరమణ బాధ్యతల నుండి తప్పించి బందాలను బలపరుస్తుంది*
ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ గౌస్ బాబా
పదవీ విరమణ చేసిన ఏ ఎస్సై కి ఘనంగా సన్మానం
జగిత్యాల
పదవీ విరమణ వృత్తిలోని బాధ్యతల నుండి తప్పించి బందాలను బలపరుస్తుందని ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ గౌస్ బాబా అన్నారు.జగిత్యాల
జోనల్ ఇంటలిజెన్సీ కార్యాలయంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ ఏఎస్సై సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి ఇటీవల పదవీ విరమణ చేయగా ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ గౌస్ బాబా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్బంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో మెజారిటీ కాలం బాధ్యతల నిర్వహణలో ఒత్తిడితో గడుస్తుందని సుదీర్ఘ కాలం నిబద్దతతో పనిచేసి పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆయన సూచించారు.కరీంనగర్ రీజినల్ అధికారి, ఇంటెలిజెన్స్ జోనల్ ఇన్స్పెక్టర్ బాణాల రాజేందర్ మాట్లాడుతూ పదవి విరమణ కేవలం ఉద్యోగ జీవితానికేనని పదవి విరమణ అనంతరం కుటుంబాలతో సుఖంగా గడపాలని అన్నారు.అనంతరం పదవి విరమణ చేసిన ఏ ఎస్సై సుధాకర్ రెడ్డి దంపతులను ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. అలాగే ఇంటెలిజెన్స్ జగిత్యాల జోనల్ పరిధిలో పనిచేసి ఇటీవల బదిలీ పై వెళ్లిన హోంగార్డు పి. శ్రీనివాస్ ను అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో
జోనల్ సబ్ ఇన్స్పెక్టర్ ఏ.వెంకటయ్య, ఇంటెలిజెన్స్
జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ వావిలాల గంగాధర్, కార్యాలయ సిబ్బంది బి. వెంకటేశ్వర్లు, మొహమ్మద్ రియాజ్,ధర్మపురి,కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జులు మరియు ఫీల్డ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.