అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి
మాజీమంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల పట్టణంలో నివసిస్తున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ కు వినతి పత్రం అందచేశారు
2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకు ఇండ్లు నిర్మించాలని ఉద్దేశంతో దాదాపు 80 గజాల విస్తీర్ణం లో నూకపెళ్లి అర్బన్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించిందని జీవన్ రెడ్డి అన్నారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం విడిపోవడం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2000 ఇందిరమ్మ ఇండ్లను కూల్చివేసి వాటి స్థానంలో 4520 డబులు బెడ్ రూమ్ లను నిర్మించారని,
మిగతా 1611 ఇందిరమ్మ ఇండ్లు వివిధ దశ లలో ఉండగా వాటి నిర్మాణానికి 52 కోట్ల రూపాయలు అవసరమని కలెక్టర్ నివేదించారు.
కానీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాల కల్పన పేరుతో అందులో నుండి 100 ఇండ్లను తొలగించారని,.
అందువలన చాలామంది ఇందిరమ్మ ఇండ్లను కోల్పోవడం జరిగిందని జీవన్ రెడ్డి అన్నారు.
ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని,..
3500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కేవలం 500 మంది మాత్రమే ప్రస్తుతం నివాసం ఉంటున్నారని,
మిగతా 3000 మంది ఎందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు రావడం లేదు వాళ్ళు నిజంగా అర్హులా ? కాదా? అని జీవన్ రెడ్డి అన్నారు.
నూతనంగా ఇండ్లు నిర్మించినప్పుడు వెంటనే అన్ని రకాల సదుపాయాలు ఏర్పడడం అనేది సాధ్యం కాదన్నారు