విధ్యుత్ ప్రమాదాల నివారణ పరిరక్షనే లక్ష్యం ఎస్ ఇ సుదర్శనం

విధ్యుత్ ప్రమాదాల నివారణ పరిరక్షనే లక్ష్యం ఎస్ ఇ సుదర్శనం

విద్యుత్ ప్రమాదాల నివారణ 
ప్రజల ప్రాణాల పరిరక్షణే లక్ష్యం 
ఉద్యోగుల అవగాహన సమావేశంలో 
విద్యుత్ శాఖ జిల్లా ఎస్ఇ సుదర్శనం

చురకలు ప్రతినిధి కోరుట్ల, జూలై 16: విద్యుత్ ప్రమాదాల నివారణ ప్రజల ప్రాణాల పరిరక్షణే లక్ష్యంగా మెరుగైన విద్యుత్ అందించేలా పునరంకితమై పని చేద్దాం అని 
జగిత్యాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఇ సుదర్శనం అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో పర్యటించిన జిల్లా ఎస్ఇ సుదర్శనం విద్యుత్ శాఖ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎస్ఇ సుదర్శనం 132/33కేవీ, 33/11కెవి కథలాపూర్ సబ్ స్టేషన్ లను సందర్శించి నూతనంగా నిర్మిస్తున్న సిరికొండ సబ్ స్టేషన్ పనులను సమీక్షించి త్వరితగతిన పనులు చేయాలని కాంట్రాక్ట్, అధికారులకు సూచించారు. తదనంతరం కోరుట్ల లోని కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్ లో మూడు మండలాల విద్యుత్ సిబ్బందితో విద్యుత్ ప్రమాదాల నివారణ, విద్యుత్ భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించారు. జగిత్యాల జిల్లాలో విద్యుత్ ప్రమాదాల జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు. ఎస్ఇ వెంట మెట్ పల్లి డీఇ మధుసూదన్, డిఇ టెక్నికల్ జిల్లా సేఫ్టీ ఆఫీసర్ గంగారాం , ఏడీఇ రఘుపతి , ఏఏఓ భూమయ్య, కోరుట్ల,మేడిపల్లి, కథలాపూర్ మండలాల ఏఈ లు, సబ్ ఇంజనీర్లు , ఓ&ఏం ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20250716-WA0088

Tags: