నల్లగొండ గద్దర్ కు రాజేందర్ రావు సన్మానం

నల్లగొండ గద్దర్ కు రాజేందర్ రావు సన్మానం

*నల్గొండ గద్దర్ కు*  
 *వెలిచాల రాజేందర్ రావు సన్మానం* 

 *హైదరాబాదులోని వెలిచాల స్వగృహానికి* *ఆహ్వానం..* 

 *యువత సన్మార్గంలో పయనించేలా మరిన్ని పాటలు పాడుతూ ప్రోత్సహించండి..* 

 *వారిలో మరింత స్ఫూర్తి నింపాలని రాజేందర్ రావు గద్దర్ కు సూచన* 

 *కరీంనగర్*..

కలలు అన్నా, సాహిత్యం అన్నా.. కళాకారులు అన్నా.. వెలిచాల కుటుంబానికి మొదటి నుండి ఎంతో మమకారం.. ప్రత్యేక అనుబంధం.. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత వెలిచాల జగపతిరావుకు మొదటినుంచి వారంటే ఎన లేని అభిమానం.. కలలు సాహిత్యం. కళాకారులపై అదే ఆత్మీయత.. అదే అభిమానాన్ని జగపతిరావు కుమారుడు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నల్గొండ గద్దర్ గా పేరు గాంచిన ప్రముఖ తెలంగాణ ఉద్యమ గాయకుడు నర్సన్నను  హైదరాబాద్ లోని వెలిచాల రాజేందర్ రావు వారి స్వగృహానికి అతిథిగా ఆహ్వానించారు. దీంతో తన ఇంటికి వచ్చిన నరసన్నకు రాజేందర్ రావు ఆత్మీయంగా శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నరసన్న యువత గంజాయి కి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో  " వద్దురా తమ్మి గంజాయి జోలికి" అనీ పాడిన పాటను గుర్తు చేస్తూ వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేకంగా అభినందించారు. యువత డ్రగ్సు, మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా వారిలో స్ఫూర్తి నింపేలా ఇలాంటి అద్భుతమైన పాటలు మరిన్ని పాడాలని రాజేందర్రావు నల్లగొండ గద్దర్ కు సూచించారు. యువత కష్టపడి చదువుకొని ఆర్థికంగా జీవితంలో నెలదోక్కుకునేలా పాటల ద్వారా వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. నరసన్న తద్వారా మరింత మంచి పేరు తెచ్చుకోవాలని రాజేందర్ రావు ఆకాంక్షించారు. నరసన్న తమ కుటుంబానికి మొదటి నుంచి ఎంతో ఆత్మీయుడని, వారి పాటలు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మంచి ప్రేరణ కలిగిస్తున్నాయని రాజేందర్రావు పేర్కొన్నారు.ఆయన పాటలు అంటే ప్రజల్లో ఎంతో క్రేజ్ ఉందని తెలిపారు. అదే ఒరవడితో రానున్న రోజుల్లోనూ మరిన్ని మంచి పాటలు పాడుతూ సమాజానికి సరికొత్త సందేశాన్ని ఇవ్వాలని రాజేందర్రావు కోరారు. రాజేందర్ రావు చేసిన సత్కారంపై నల్లగొండ గద్దర్ నరసన్న ఆనందం వ్యక్తం చేశారు.IMG-20250727-WA0050

Tags: