సమస్యల పరిష్కారానికి కృషి ఎస్. ఇ. సుదర్శనం
By: Mohammad Imran
On
సమస్యల పరిష్కారానికి కృషి
జగిత్యాల ఎస్ఇ సుదర్శనం
జగిత్యాల, జూలై 1: సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని జగిత్యాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఇ సుదర్శనం అన్నారు. మంగళవారం జిల్లా విద్యుత్ ఎస్ఇ సుదర్శనం విద్యుత్ కార్మిక సంఘం టీఆర్వీకెఎస్ యూనియన్ కలిసింది. వివిధ కార్మికుల సమస్యలపై ఎస్ఇ చర్చించి సానుకూలంగా స్పందించారు. సమస్యలు త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వేణు, జిల్లా కార్యదర్శి రాజావీరు,జిల్లాలోని జగిత్యాల, మెట్ పల్లి డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు సతీష్, మధు, దేవరాజు, శ్రీధర్ సిటీ సర్కిల్ అధ్యక్షులు సతీష్, కార్యదర్శి చంద్రశేఖర్, విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు.
Tags: