యాంటి డ్రగ్స్ అవగాహన వాలిబాల్ టోర్నమెంట్

యాంటి డ్రగ్స్ అవగాహన వాలిబాల్ టోర్నమెంట్

యాంటీ డ్రగ్ అవగాహన వాలీబాల్ టోర్నమెంట్.

చురకలు విలేకరి, కోరుట్ల, జూలై 23: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   ఆదేశాల మేరకు మెట్పల్లి డి.ఎస్.పి. ఏ .రాములు  పర్యవేక్షణలో  కోరుట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్  బి. సురేష్ బాబు నేతృత్వంలో ఆంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సర్కిల్ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు.
ఈ టోర్నమెంట్‌లో సర్కిల్ ఎస్ఐ లు ఎమ్. చిరంజీవి, జి. నవీన్ కుమార్, ఎమ్. శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టోర్నీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్న జట్లకు విజేతల బహుమతులు అందజేశారు.
క్రీడల ద్వారా యువతను మత్తుపదార్థాల నుంచి దూరంగా ఉంచడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్‌ నిర్వహించబడిందని, గంజాయి, డ్రగ్స్ వంటివాటిపై అవగాహన పెంచే కార్యక్రమాల్లో క్రీడాకారులు రోల్ మోడల్స్‌గా ఉండాలని  సి ఐ. బి. సురేష్ బాబు  పేర్కొన్నారు. ఈ సందర్భంగా  కార్యక్రమానికి సహకరించిన సీనియర్  పి ఈ టి గంగాధర్ , లక్ష్మీనారాయణ, ఇతర శిక్షకులు సీనియర్ క్రీడాకారుడు బారీలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.IMG-20250723-WA0093

Tags: