విడిన గత రెండేళ్ల కేసు మిస్టరి డిస్పి రఘు చందర్
వీడిన గత రెండేళ్ల కేసు మిస్టరీ.
మృతుడి భార్యే ప్రధాన నిందితురాలు.
వివరాలను వెల్లడించిన డిఎస్పీ రఘుచందర్.
చురకలు విలేకరి, మల్యాల, జులై 24: కొండగట్టులో లభ్యమైన కాలిన మగ శవం కేసు వివరాలను గురువారం మీడియా సమావేశంలో డిఎస్పీ రఘు చందర్ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2023 మార్చి 14వ తేదీన ముత్యంపేట గ్రామ వీఆర్ఏ అజీముద్దీన్ కొండగట్టు శివారులోని టేకు తోట ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఒక గుర్తు తెలియని మృతదేహం కాలి ఉన్నట్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని మల్యాల పోలీసులు విచారణ చేపట్టారు. గత వారం రోజుల క్రితం మెట్ పల్లి పోలీసులు గంజాయి తరలిస్తున్న వ్యక్తులను పట్టుకొని విచారిస్తున్న సమయంలో కొండగట్టులోని హత్యకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. మృతుడు సింగం నడిపి గంగాధర్ మెట్ పల్లికి చెందిన వ్యక్తి నీ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. సింగం సంధ్య భర్త నడిపి గంగాధర్ తాగుడుకు బానిసగా మారి పిల్లలని తనను శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గుర్తిస్తూ రోజు గొడవపడేవాడని, ఈ విషయాన్ని సింగం సంధ్య భర్త సొంత అన్న కొడుకు అయిన గ్రహీత్ కు అతని తల్లి మమతకు చెప్పగా ఇంట్లో మంచిగా ఉండాలని చెప్పిన తనలో మార్పు రాలేదని, అయితే తన భర్త వల్ల తమ జీవితాలు నాశనం అయితాయని భావించిన సంధ్య తన భర్తను హతమార్చాలని గ్రహీతకు చెప్పగా తాను 4,000 రూపాయల సుపారి ఇస్తే మిగతా వ్యక్తులను తీసుకువస్తానని చెప్పడం జరిగిందన్నారు. అనుకున్న ప్లాన్ ప్రకారం గ్రహీత్ తన స్నేహితులు అబ్దుల్ అప్సర్, పవన్, చేన్న నిఖిల్, సింగం సంధ్య ,సింగం మమత ఒక కారు అద్దెకు తీసుకొని మృతుడిని ఎక్కించుకొని కొండగట్టు వద్దకు వచ్చి మద్యం తాగించారని, మద్యం మత్తులో ఉన్న మృతుడిని అక్కడ చెత్తలో ఉన్న వైర్ల సహాయంతో మెడకు చుట్టి లాగినా, ప్రాణం పోకపోవడంతో టీవీ అద్దం పగలగొట్టి దానితో మెడ కోశారని, మృతుడి ప్రాణం పోయిందని నిర్ధారించుకొని ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు శవాన్ని ఎవరు గుర్తించకుండా అక్కడ ఉన్న చెత్తనంతా శవం మీద వేసి తగలబెట్టారు. వచ్చిన అదే కారులో మెట్ పల్లి తిరిగి వెళ్ళిపోయారని, అప్పటినుండి సింగం సంధ్య ను తన భర్త గురించి ఎవరు అడిగినా తన భర్త తాగుబోతోడు మమ్మల్ని వదిలి పెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు అని మాయమాటలు చెబుతూ వచ్చిందన్నారు. కాగా నిందితులు సింగం గ్రాహిత్, అబ్దుల్ అప్సర్, చేన్న నిఖిల్ లను గంజాయి కేసులో మెట్ పల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారని, పవన్ అనే నిందితుడు చంచల్ గూడ జైలులో వేరొక కేసులో శిక్ష అనుభవిస్తుండగా సింగం మమత చనిపోయిందని, ప్రధాన నిందితురాలైన సింగం సంధ్యను రిమాండ్ కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో మల్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నీలం రవి మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్, మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.