రాచకొండ సీపీ ముందు లొంగిపోయిన మావొయిస్ట్ నాయకులు
"సిపిఐ (మావోయిస్ట్),
సీనియర్ మావోయిస్టు వో
(SCMs) తెలంగాణ పోలీస్ ఎదుట లొంగుబాటు."
మాల సంజీవ్ లెంగు దాదా.
సెక్రటేరియట్ సభ్యుడు DKSZC
పెరుగుల పార్వతి బొంతల పార్వతి @ దీనా,
రాష్ట్ర కమిటీ సభ్యుడు-DKSZC
* 45 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉన్న సీనియర్ మావోయిస్టు నాయకుడు, గద్దర్ సమకాలికుడు. DKSZC సెక్రటేరియట్ మెంబర్ (SCM) అగు మాల సంజీవ్, అతని భార్య దీనా స్టేట్ కమిటీ మెంబర్ (SCM) తో కలిసి జన జీవన స్రవంతిలో కలవటం, తెలంగాణ పోలీస్ మావోయిస్టు పార్టీ పట్ల అవలంబిస్తున్న సమగ్రమైన విధానానికి ఒక నైతిక విజయంగా భావిస్తున్నాము.
* నాలుగు దశాబ్దాలపాటు CPI మావోయిస్టులో పనిచేసి జన జీవన స్రవంతిలోకి వచ్చిన సీనియర్ మావోయిస్టు నాయకులు మాల సంజీవ్, SCM మరియు ఇతని భార్య పెరుగుల పార్వతి, SCM.
అజ్ఞాతం లో ఉన్న తెలంగాణ మావోయిస్టులు కూడా వారి గ్రామాలకు తిరిగి రావాలని కోరుతున్నాం.
* పోరు వద్దు!! - ఊరు ముద్దు!! అనే పిలుపుని పునరుద్ఘాటిస్తున్నాము.
* CPI మావోయిస్టు ఉద్యమాన్ని వదిలి జన జీవన స్రవంతిలోకి వచ్చిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే ఫలితాలను అందచేస్తాం.
ఈ రోజు అనగా, 17.07.2025 తేదీన నిషేదిత CPI మావోయిస్టు పార్టీకి చెందిన ఇరువురు సీనియర్ అజ్ఞాత నాయకులు "రాచకొండ పోలీస్ కమిషనరేట్" పోలీసుల ఎదుట జన జీవన స్రవంతిలో కలవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహాకారాలు మరియు జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకొని, తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని, రాచకొండ పోలీస్ కమీషనర్ ఎదుట జన జీవన స్రవంతిలో కలిసినారు.