రాష్ట్రాన్ని పాలించే హక్కు కాంగ్రెస్ కు లేదు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్రాన్ని పాలించే హక్కు కాంగ్రెస్ కు లేదు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు కాంగ్రెస్ లేదు

-కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు

-కేంద్రం రేవంత్ రెడ్డి రక్షణ కవచంగా నిలిచింది

-కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు

-డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

మల్లాపూర్, జూలై 10 IMG-20250710-WA0107 తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా నిలిచిందని ధ్వజమెత్తారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం పాలనలో మోదీ ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను దొంగలపాలు చేసి రాష్ట్ర ప్రజలు బాదపడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వమే కావలంటూ గ్రామ గ్రామాన ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో, మున్సిపాల్టీలలో బీఆర్ఎస్ పార్టీ విజయ దుందూబి మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం గుజరాత్లో అభివృద్ధి పేరటన కట్టి బ్రిడ్జీలు కూలుతున్నాయన్నారు. యూరియాపై తెలంగాణకు ఇవ్వాల్సిన కోటా పై స్పష్టతనే లేదన్నారు. యూరియా కోరతను తీర్చడంలో బీజేపీ, కాంగ్రెస్లు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. అంతకు ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనను భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ముందుగా ముత్యంపేటలోని పూలే, అంబెడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్య జాన్సన్ నాయక్, మాజీ జడ్పి చైర్ పర్సన్ దావా వసంత, మాజీ జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కటిపెళ్లి అదిరెడ్డి, తోట శ్రీనివాస్, ముద్దం శరత్, బండి లింగస్వామి, కొమ్ముల జీవన్, ఏనుగు రాం రెడ్డి, దేవా మల్లయ్య, మ్యాకాల సతీష్, మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: