ఇల్లేందు సీఐ సత్యనారాయణ సస్పెండ్
ఇల్లెందు సీఐ సత్యనారాయణ సస్పెండ్.
చురకలు ప్రతినిధి, హైదరాబాద్, జూన్ 25: ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ కార్యాలయం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఓ భార్యా భర్తల మధ్య వివాదం కేసులో, భర్త తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించి వారి హక్కులకు భంగం కలిగించినందులకు గాను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఈ చర్య తీసుకున్నట్లు ఎస్పీ కార్యాలయం అధికారిక ప్రకటనలో వివరించింది. ఇందులో భాగంగానే సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వును జారీ చేశారని తెలిపింది. పోలీసు అధికారులు గానీ, సిబ్బంది గానీ ఎవరైనా సరే పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో అమర్యాదగా ప్రవర్తిస్తే శాఖాపరమైన విచారణ జరిపి క్రమశిక్షణా చర్యలు తప్పవని ఈ సందర్బంగా ఎస్పీ కార్యాలయం వెల్లడించింది.