నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

నకిలీ సర్టిఫికేట్లను తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు.

వివరాలు వెల్లడించిన కోరుట్ల సీఐ సురేష్ బాబు.

చురకలు ప్రతినిధి, కోరుట్ల, జులై 23: నకిలీ సర్టిఫికేట్ల తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు చేసి రిమాండ్ కు  తరలించినట్లు కోరుట్ల సీఐ సురేష్ బాబు తెలిపారు. బుధవారం కోరుట్ల పోలీస్ స్టేషన్ లో  ఏర్పాటు చేసిన విలేకరుల ఆయన మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలోని పోచమ్మవాడలో మంత్ర ఆన్లైన్ సెంటర్ నిర్వహకుడు రుద్ర వేణుగోపాల్ అనే వ్యక్తి సకిలీ సర్టిఫికేట్ల తయారు చేస్తున్నాడని సమాచారం రాగా సిసిఎస్ పోలీసులు ఆన్లైన్ సెంటర్ పై ఆకస్మిక దాడి చేసి 106 నకిలీ సర్టిఫికేట్లు, ఒక కంప్యూటర్, ఒక ప్రింటర్, ఒక లామినేషన్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడైన రుద్ర వేణుగోపాల్ నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి అవసరమున్న వారికి విక్రయించి డబ్బులు సంపాదించే వాడని, అతని వద్ద నుండి నకిలీ ఎస్సెసీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ సర్టిఫికేట్లు, నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితున్ని పట్టుకోవడంలో కృషి చేసిన కోరుట్ల సీఐ సురేష్ బాబు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాస్, ఎస్ఐలు చిరంజీవి, కె. రాజు, కానిస్టేబుళ్లు అఫ్రోజ్, సాజిద్, వినోద్, కమలాకర్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.IMG-20250723-WA0086

Tags: