యువకుని ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

యువకుని ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

 

ఆత్మహత్య చేసుకుంటానని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడికి కౌన్సిలింగ్ నిర్వహించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

చురకలు విలేఖరి

కరీంనగర్

గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన యువకుడికి కౌన్సిలింగ్ నిర్వహించి అతని ప్రాణాలను కానిస్టేబుల్ రక్షించిన సంఘటన ఆదివారం నాడు జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్తపల్లి మండలం బావుపేటకు చెందిన నేరెళ్ల సన్నీ అలియాస్ దయాసాగర్ కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. అనంతరం తన ఉన్మాద చర్యలకు పాల్పడి ఇంట్లోని వస్తువులను చిల్లర వందర చేయడంతో పాటు కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు. అనంతరం తన కుటుంబ సభ్యుల చర్యలను నిరసిస్తూ గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కానిస్టేబుల్ విజయరావు డయల్ 100  ద్వారా సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్నాడు. వాటర్ ట్యాంక్ ఎక్కిన సన్నితో మాట్లాడుతూ కౌన్సిలింగ్ నిర్వహించారు. సన్నీ షరతులకు అనుగుణంగా కుటుంబ సభ్యులను ఒప్పించి వాటర్ ట్యాంక్ దింపి అతని ప్రాణాలను రక్షించడంతోపాటు కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన  గొడవలను సద్దు మణిగించేందుకు వారితో కొన్ని ఒప్పందాలు చేయించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వాటర్ ట్యాంక్ ఎక్కి బెదిరింపులకు పాల్పడిన యువకుడికి కౌన్సిలింగ్ నిర్వహించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ విజయ రావు ను కరీంనగర్ రూరల్ ఏసిపి శుభం ప్రకాష్,IMG-20250601-WA0057 సిఐ  ఏ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఎస్ఐ ఎస్ సాంబమూర్తిలు అభినందించారు

Tags: