సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహనా సదస్సు
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
జగిత్యాల జిల్లా పోలీసుల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహణ
కోరుట్ల, ఆగస్టు,06,
ఇటీవల వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలను నియంత్రించేందుకు, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ– డి 4 సి జగిత్యాల ఎం. వెంకటరమణ ఆధ్వర్యంలో, మెట్పల్లి డీఎస్పీ ఏ. రాములు, కోరుట్ల ఎస్ఐ ఎం. చిరంజీవి, సైబర్ క్రైం ఎస్‌ఐలు కృష్ణ, దినేష్ సమక్షంలో, కోరుట్ల పట్టణంలోని పీబీ గార్డెన్లో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్న భారీ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై వివిధ అంశాలు వివరించారు. ముఖ్యంగా ఓటీపీ ఫ్రాడ్స్
ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ల ద్వారా మోసాలు, బ్యాంక్ లోన్ ఫ్రాడింగ్స్
దురుద్దేశంతో పంపే ఏపీకె యాప్ లింకులు
వంటి అంశాలపై ఉదాహరణలతో అవగాహన కల్పించారు.
విద్యార్థులకు స్క్రిప్ట్ రూపంలో సమాచారం అందజేయడం ద్వారా నేరాలు ఎలా జరుగుతాయో, వాటికి ఎలా లోనవ్వకుండా ఉండాలో సూచనలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సహకరించిన ట్రైస్మా టౌన్ ప్రెసిడెంట్ ఎం.ఎ. భారీ, ట్రైస్మా స్కూల్ యాజమాన్యం వారి సభ్యులకు డీఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.