మేటాఫండ్ ప్రో కేసులో నిందుతుని అరెస్ట్

మేటాఫండ్ ప్రో కేసులో నిందుతుని అరెస్ట్

మెటాఫండ్ ప్రో కేసులో నిందితుల అరెస్టు.

వివరాలు వెల్లడించిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, అక్టోబర్ 10: మెటాఫండ్ పేరిట క్రిస్టో మోసాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణానికి చెందిన కస్తూరి రాకేష్ కుమార్, కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, వీరబత్తిని రాజులు మెటా
ఫండ్ ప్రో అనే యాస్ తయారు చేసి ఒక లక్ష రూపాయాలు పెట్టుబడి పెడితే రూ.3లక్షలు వస్తాయని, ఎంత ఎక్కువ మందిని జాయిస్ చేయిస్తే అంత ఎక్కువగా డబ్బులు వస్తాయని, విదేశీ యాత్రలు ఉచితంగా చేయవచ్చని గొలుసుకట్టు వ్యాపారం చేసి ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. నిందితులు ముగ్గురు కొడిమ్యాలకు చెందిన ముగ్గురి నుండి రూ.20లక్షలు వసూలు చేసి వారికి మూడింతల లాభం వస్తుందని, గోవా, సింగపూర్, దుబాయి వంటి దేశాలకు ఉచితంగా
టూర్లకు పంపిస్తామని ఆశ చూపి మోసం చేశారని, మెటా ఫండ్ ప్రో అనే యాప్ను మూసి వేశారని, ఈ యాప్లో పెట్టుబడి పెట్టిన అనే మంది బాధితులు
నష్టపోయారన్నారు. కొడిమ్యాలకు చెందిన ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఏ2 సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, ఎ3 రాజులను అక్టోబర్ 8న అరెస్టు చేసి కోర్టులో హజరుపర్చామన్నారు. ఏ1గా ఉన్న కస్తూరి రాకేష్ కుమార్ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించామని వెల్లడించారు. రాకేష్ కుమార్ వద్ద నుండి ఓ ల్యాప్ టాప్, రూ. 1 లక్ష నగదు, బ్యాంకు పాస్ బుక్కులు, ఏటిఎం కార్డులు, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రజలు ఎవరు కూడా గొలుసుకట్టు వ్యాపారం పేరుతో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని సూచించారు. ఈ సమావేశంలో డిఎస్సీ కఘుచందర్, మల్యాల సీఐ నీలం రవి, కొడిమ్యాల ఎస్ఐ సందీప్ తదితరులు పాల్గొన్నారు.IMG-20251010-WA0100

Tags: