క్రిప్టో నిందుతుల పై ఉక్కు పాదం మోపాలి, రాజేందర్ రావు
*క్రిప్టో నిందితులపై ఉక్కు పాదం మోపాలి..*
*ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టవద్దు..*
**అలాంటి వ్యవహారాలు మళ్లీ* *చేయాలంటేనే వణుకు పుట్టాలి..*
*బాధితులకు పోలీసు అధికారులు న్యాయం జరిగేలా చూడాలి..*
**క్రిప్టో కేసులో అరెస్ట్ అయిన మాజీ* *కార్పొరేటర్ కట్ల సతీష్ ను పీసీసీ* *అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు* *కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ నుంచి*
*వెంటనే బహిష్కరించాలి..*
*ఈ విషయంలో పిసిసి, డిసిసి అధ్యక్షులకు లేఖలు రాశా..*
*పోలీస్ అధికారులు క్రిప్టో కేసుపై*
*లోతుగా విచారణ జరపాలి..*
*బాధితులకు న్యాయం చేయాలి..*
*సామాన్యులు కోట్లాది*
*రూపాయలు నష్టపోయారు..*
*ఈ వ్యవహారంలో పోలీస్ అధికారులు మరింత లోతుగా విచారణ జరపాలి..*
*పత్రికల్లో వస్తున్న వార్తలను*
*సుమోటాగా స్వీకరించాలి..*
*సిపి గౌస్ ఆలం ప్రత్యేక దృష్టితో అక్రమార్కుల ఆగడాలకు కళ్లెం..*
*కట్ల సతీష్ బిఆర్ఎస్ లో* *ఉన్నప్పుడే*
*ఈ వ్యవహారానికి బీజం పడింది..*
**నాటి పాలకుల నిర్లక్ష్యమే*
*నేడు పేదలకు శిక్ష..*
*బీఆర్ఎస్ నేతల ప్రధాన పాత్ర ఉండడం వల్లే చర్యలు తీసుకోలేకపోయారు..*
*క్రిప్టో బాధితులు నిర్భయంగా* *పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలి..*
*కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు*
*కరీంనగర్..*
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ పేరిట సామాన్య పేద ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టిన నిందితులందరిపై పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపాలనీ, మళ్లీ అలాంటి వ్యవహారాలు చేయాలంటేనే వారిలో వణుకు పుట్టేలా కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సూచించారు. ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా వదిలి పెట్టవద్దనీ, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని పేర్కొన్నారు. ఇప్పటికే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఈ కేసు విషయంలో ప్రత్యేక దృష్టి సారించడంలో అక్రమార్కుల ఆగడాలకు కళ్లెం పడుతున్నదన్నారు. ఇందుకు ప్రత్యేక చొరవ చూపుతున్న సీపీకి రాజేందర్రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్రిప్టో కరెన్సీ కేసులో శుక్రవారం అరెస్టయిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ ను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని రాజేందర్రావు కోరారు. ఈ విషయంలో పీసీసీ, డిసిసి అధ్యక్షులకు లేఖలు రాశానని పేర్కొన్నారు.
శనివారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడులు పెడితే అధికంగా లాభాలు వస్తాయని కొంతమంది మాయమాటలు చెప్పి పేద ప్రజల వద్ద నుంచి వసూలు చేసి కోట్లాది రూపాయ లను పెట్టుబడులు పెట్టించారని ఆరోపించారు. కొద్దిరోజులకే కోట్లాది రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టి సామాన్య ప్రజలను మోసగించారనీ, ఈ వ్యవహారంలో జిల్లా పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సూత్రధారులు అందర్నీ అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కూలీ నాలీ చేసుకొని పైసా పైసా కూడ పెట్టుకుని బతుకుతున్న సామాన్య ప్రజల జీవితాలను క్రిప్టో కరెన్సీ పేరిట రోడ్డుపాలు చేయడం దారుణమని రాజేందర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టో పేరిట సామాన్య పేద ప్రజలు మోసపోయిన వైనంపై ప్రతిరోజు పత్రికల్లో అనేక వార్తలు వస్తున్నాయనీ, వీటిని సుమోటోగా తీసుకొని పోలీస్ అధికారులు కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ ను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. కట్ల సతీష్ ను బహిష్కరించాలని కోరుతూ పిసిసి, డిసిసి అధ్యక్షులకు లేఖలు రాసినట్లు రాజేందర్ రావు తెలిపారు. సతీష్ అరెస్టు విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కట్ల సతీష్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారనీ, అంతకు ముందు బీఆర్ఎస్ లో పనిచేశారని చెప్పారు. బీఆర్ఎస్ లో ఉండగానే కట్ల సతీష్ క్రిప్టో కరెన్సీ వ్యవహారం నడిపించారనీ, బీఆర్ఎస్ లో ఉండగానే అనేకమంది నుంచి డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. అనేకమంది నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. క్రిప్టోలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి అనేకమంది నుంచి పెట్టుబడులు పెట్టించినట్లు పలువురు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ పాలకులు ఇష్ట రాజ్యాంగ వ్యవహరించడం వల్లే క్రిప్టో కరెన్సీ వ్యవహారం పెనుభూతంగా మారిందన్నారు. ఆ పార్టీ నేతల ప్రధాన పాత్ర ఇందులో ఉండటంతోనే నాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపో యిందనీ, చర్యలకు జంకిందనీ, ఆనాడే కఠిన చర్యలు తీసుకుంటే నేడు పేదలకు ఇలాంటి కష్టాలు రాకుండా ఉండేవని రాజేందర్ రావు మండిపడ్డారు.
ఈ వ్యవహారంలో ఎంతటి వారున్నా నిందితులను పోలీసు అధికారులు వదిలి పెట్టవద్దని రాజేందర్ రావు సూచించారు. కఠినంగా శిక్షించాల్సిందేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇలాంటి కేసుల విషయంలో పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. సామాన్య ప్రజలకు ఈ కేసు విషయంలో న్యాయం జరగాలనీ, ఇందుకు మంచి అధికారగా పేరొందిన సిపి గౌస్ అలాం అండగా నిలుస్తున్నందుకు అభినందనలు తెలిపారు. క్రిప్టో కరెన్సీ నిందితులపై కఠిన చర్యలు తీసుకొని పేద ప్రజలకు అన్యాయం జరగకుండా పోలీస్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. క్రిప్టో పేరుతో మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నా వివరాలతో పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదు చేయాలని రాజేంద్ర రావు కోరారు. క్రిప్టో బాధితులు ఎలాంటి భయాందోళన చెందకుండా నిర్భయంగా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని వెలిచాల రాజేందర్ రావు సూచించారు.